మురసు తుఫాన్ ఎఫెక్ట్, NewzFast Telugu: ఆంధ్రప్రదేశ్‌లో మురసు తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుఫాన్ తీరం దాటినా దాని ప్రభావం ఇంకా కొనసాగుతోంది.
ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అలాగే తీవ్ర గాలులు కూడా వీస్తున్నాయి.
వాతావరణ శాఖ అధికారుల వివరాల ప్రకారం, గుంటూరు జిల్లా పొన్నూరులో అత్యధికంగా 31.2 సెం.మీ. వర్షపాతం నమోదైంది.
గుంటూరులో 30 సెం.మీ., సత్తెనపల్లిలో 17.9 సెం.మీ., తెనాలిలో 17.1 సెం.మీ. వర్షపాతం రికార్డయ్యింది.
బాపట్లలో 15.7 సెం.మీ., నరసరావుపేటలో 14.5 సెం.మీ., ఏలూరులో 14.1 సెం.మీ., చీరాలలో 13.5 సెం.మీ. వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.
తుఫాన్ ప్రభావం ఉన్నప్పటికీ ఏపీలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. అయితే పలు ప్రాంతాల్లో వర్షాలు, తీవ్ర గాలుల కారణంగా కౌంటింగ్‌ను వాయిదా వేసిన పరిస్థితులు నెలకొన్నాయి.




