ఆదివాసి గూడేలలో గుస్సాడీల సందడి, దండారి ఉత్సవాలు ప్రారంభం

దండారి ఉత్సవాలు: దీపావళి పండుగను పురస్కరించుకొని ఏజెన్సీ ప్రాంతమైన ఆదిలాబాద్ జిల్లా నార్నూర్, గాదిగూడ మండలాల పరిధిలోని ఆదివాసి గూడేలలో ఆదివాసులు దండారి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఆదివాసులు తమ తమ గూడెల్లో భోగి వేడుకతో దండారి ఉత్సవాలను ప్రారంభించారు. మంగళవారం దండారి నిర్వాహకులు ఆవరణలో ఏత్మాసూర్ దేవత ప్రతిమలకు, డోలు, డప్పులు, నెమలి టోపీలు, గజ్జెలు, రోలు, మేక చర్మం వంటి గుస్సాడీ వేష ఆదరణ సామగ్రికి సాంప్రదాయ పూజలు చేసి నైవేద్యం సమర్పించారు. వారం రోజులపాటు ఆదివాసి గూడెళ్లలో నియమ నిష్టతో.

దండారి ఉత్సవాలు, NewzFast Telugu (ఆదిలాబాద్ జిల్లా, నార్నూర్, గాదిగూడ మండలాలు): దీపావళి పండుగను పురస్కరించుకొని ఏజెన్సీ ప్రాంతమైన ఆదిలాబాద్ జిల్లా నార్నూర్, గాదిగూడ మండలాల పరిధిలోని ఆదివాసి గూడేలలో ఆదివాసులు దండారి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు.

ఆదివాసులు తమ తమ గూడెల్లో భోగి వేడుకతో దండారి ఉత్సవాలను ప్రారంభించారు. మంగళవారం దండారి నిర్వాహకులు ఆవరణలో ఏత్మాసూర్ దేవత ప్రతిమలకు, డోలు, డప్పులు, నెమలి టోపీలు, గజ్జెలు, రోలు, మేక చర్మం వంటి గుస్సాడీ వేష ఆదరణ సామగ్రికి సాంప్రదాయ పూజలు చేసి నైవేద్యం సమర్పించారు.

వారం రోజులపాటు ఆదివాసి గూడెళ్లలో నియమ నిష్టతో దండారి ఉత్సవాలు కొనసాగుతాయని, కొల బొడీతో ఈ ఉత్సవాలు ముగుస్తాయని గ్రామ పెద్దలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ మెస్రం రూప్ దేవ్ పటేల్, ఇంద్రవెల్లి మార్కెట్ కమిటీ వైస్ మాజీ చైర్మన్ తోడసం నాగోరావ్, మెస్రం మోతిరాం పటేల్, కోట్నాక్ నానాజీ, మెస్రం సీతారాం, ఆదివాసి విద్యార్థి సంఘం మండల అధ్యక్షుడు కోట్నాక్ శ్యామ్ రావు, మెస్రం కిరణ్, జుగ్నోక్ భీం రావ్, మోతిరామ్ తదితరులు పాల్గొన్నారు.

ముఖేష్ గుసాయిన్

ముఖేష్ గుసాయనా 6 సంవత్సరాల జర్నలిజం అనుభవం కలిగిన డిజిటల్ న్యూస్ ఎడిటర్. JCD విద్యాపీఠ్, సిర్సా నుంచి BMC పూర్తి చేశారు. NewzFastTelugu.com ద్వారా విశ్వసనీయమైన వార్తలు మరియు ఉపయోగకరమైన సమాచారాన్ని పాఠకులకు అందించడంపై దృష్టి సారిస్తున్నారు.

Website

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

క్రీడలు

వార్తా విభాగాలు