జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికెట్ సింగరేణి పెన్షనర్లు, NewzFast Telugu (రుద్రంపూర్): కోల్ మైన్స్ పెన్షన్ మరియు సింగరేణి సీపీఆర్ఎంఎస్ మెడికల్ కార్డు అర్హత కలిగిన మాజీ సింగరేణి ఉద్యోగులు, పెన్షనర్లు ప్రతి సంవత్సరం నవంబర్ నెలలో తమ లైఫ్ సర్టిఫికెట్ (జీవన్ ప్రమాణ్)ను తప్పనిసరిగా అప్డేట్ చేసుకోవాలని కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ సీహెచ్.వెంకట రమణ సూచించారు.
ఈ మేరకు ఆయన ఒక ప్రకటనలో వివరాలు వెల్లడించారు. డిజిటల్ విధానంలో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికెట్‌ను సులభంగా నమోదు చేసుకునే ప్రక్రియపై అవగాహన కల్పించేందుకు సింగరేణి యాజమాన్యం, రీజినల్ కమిషనర్, సీఎంపీఎఫ్ కొత్తగూడెం రీజియన్ సంయుక్తంగా అవగాహన సదస్సును నిర్వహించనున్నాయి.
ఈ నెల 5, 6 తేదీల్లో రుద్రంపూర్‌లోని సీఈఆర్ క్లబ్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండు రోజుల పాటు ఈ సదస్సు కొనసాగుతుంది. పెన్షన్‌తో పాటు సీపీఆర్ఎంఎస్ మెడికల్ కార్డు కోసం డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్‌ను నమోదు చేసుకునే విధానాన్ని ఈ సందర్భంగా వివరిస్తారు.
మాజీ సింగరేణి ఉద్యోగులు, పెన్షనర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జీఎం కోరారు. అర్హులైన వారు తమ కుటుంబ సభ్యులతో కలిసి సదస్సుకు హాజరై జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికెట్‌ను నమోదు చేసుకోవాలని సూచించారు.
