తిరుపతి-విశాఖ మధ్య త్వరలో కొత్త డబుల్ డెక్కర్ రైలు

తిరుపతి-విశాఖ న్యూ డబుల్ డెక్కర్ రైలు: ప్రస్తుతం తిరుపతి-విశాఖపట్టణం మధ్య నడుస్తున్న డబుల్ డెక్కర్ రైలు స్థానంలో రైల్వేశాఖ కొత్త బోగీలతో రైలును సిద్ధం చేసింది. ప్రస్తుతం ఈ రైలు కపూర్తలాలోని రైల్ కోచ్ ఫ్యాక్టరీలో ట్రయల్స్‌లో ఉంది. పాత రైలు తుప్పు పట్టడంతో ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు పెరిగిన నేపథ్యంలో ఈ మార్పు చేపట్టారు.

తిరుపతి-విశాఖ న్యూ డబుల్ డెక్కర్ రైలు, NewzFast Telugu (తిరుపతి): తిరుపతి-విశాఖపట్టణం మధ్య ప్రస్తుతం నడుస్తున్న డబుల్ డెక్కర్ రైలు 2011లో తయారైంది. దీన్ని 2012లో తిరుపతి-హైదరాబాద్ మధ్య ఏర్పాటు చేశారు.

ప్రయాణికుల నుంచి ఆదరణ లేకపోవడంతో ఈ రైలును కర్నూలు-హైదరాబాద్, తిరుపతి-విజయవాడ మధ్య నడిపారు. అయినా ఆదరణ అంతంతమాత్రంగానే ఉండటంతో 2016 డిసెంబరు 31 నుంచి తిరుపతి-విశాఖపట్టణం (వైజాగ్) మధ్య నడుపుతున్నారు.

ఈ రైలు తిరుపతి నుంచి ప్రతి బుధ, శుక్ర, ఆదివారాల్లో రాత్రి 9.50 గంటలకు బయల్దేరి, మరుసటి రోజు ఉదయం 10.40 గంటలకు వైజాగ్ చేరుకుంటుంది. వైజాగ్ నుంచి సోమ, గురు, శనివారాల్లో రాత్రి 11 గంటలకు బయల్దేరి, మరుసటి రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది.

తొమ్మిది బోగీలతో నడిచే ఈ రైలులో 720 మంది ప్రయాణించే సామర్థ్యం ఉంది. కాలక్రమేణా రైలు పాతబడి తుప్పు పట్టడంతో ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు అధికమయ్యాయి.

ఒక్కో బోగీని తొలగించి, వాటి స్థానంలో సాధారణ బోగీలను ఏర్పాటు చేసి నడుపుతున్నారు.

ప్రస్తుతం రెండు బోగీలు డబుల్ డెక్కర్‌గా, మిగిలిన ఏడు ఎరుపు రంగులో ఉన్న ఏసీ బోగీలుగా ఈ రైలు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రైల్వేశాఖ దాని స్థానంలో కొత్త బోగీలతో రైలును తయారు చేయించింది.

ప్రస్తుతం ఈ రైలు కపూర్తలా (పంజాబ్)లోని రైల్ కోచ్ ఫ్యాక్టరీలో ట్రయల్స్‌లో ఉంది.

ముఖేష్ గుసాయిన్

ముఖేష్ గుసాయనా 6 సంవత్సరాల జర్నలిజం అనుభవం కలిగిన డిజిటల్ న్యూస్ ఎడిటర్. JCD విద్యాపీఠ్, సిర్సా నుంచి BMC పూర్తి చేశారు. NewzFastTelugu.com ద్వారా విశ్వసనీయమైన వార్తలు మరియు ఉపయోగకరమైన సమాచారాన్ని పాఠకులకు అందించడంపై దృష్టి సారిస్తున్నారు.

Website

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

క్రీడలు

వార్తా విభాగాలు