తొర్రూరులో ఘనంగా నాగుల చవితి వేడుకలు

నాగుల చవితి: మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ కేంద్రంలో నాగుల చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. మున్సిపల్ పరిధిలోని 10వ వార్డులో ఉన్న పురాతన నాగమయ్య పుట్ట వద్ద శుక్రవారం వందలాది మంది మహిళలు, భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి ఏడాది ఇక్కడ నాగుల చవితి వేడుకలు భక్తిశ్రద్ధలతో జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో మున్సిపల్ చైర్మన్ శ్రవణ్ కుమార్ సహకారంతో కౌన్సిలర్ ముద్దసాని సురేష్ గురువారం పుట్ట పరిసరాలను శుభ్రం చేయించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేపట్టారు. నాగుల చవితి పర్వదినం.

నాగుల చవితి, NewzFast Telugu (తొర్రూరు, మహబూబాబాద్ జిల్లా): మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ కేంద్రంలో నాగుల చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. మున్సిపల్ పరిధిలోని 10వ వార్డులో ఉన్న పురాతన నాగమయ్య పుట్ట వద్ద శుక్రవారం వందలాది మంది మహిళలు, భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ప్రతి ఏడాది ఇక్కడ నాగుల చవితి వేడుకలు భక్తిశ్రద్ధలతో జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో మున్సిపల్ చైర్మన్ శ్రవణ్ కుమార్ సహకారంతో కౌన్సిలర్ ముద్దసాని సురేష్ గురువారం పుట్ట పరిసరాలను శుభ్రం చేయించారు.

భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేపట్టారు.

నాగుల చవితి పర్వదినం సందర్భంగా శుక్రవారం వేకువజాము నుంచే మహిళలు కుటుంబసభ్యులతో కలిసి పుట్ట వద్దకు చేరుకున్నారు. పసుపు, కుంకుమ, కోడిగుడ్లు, ఆవుపాలు, చలిమిడి ప్రసాదాలను సమర్పించి నాగేంద్రుడికి పూజలు చేశారు.

తమ కుటుంబాల్లో ఎలాంటి దోషాలు ఉన్నా తొలగించాలని వేడుకున్నారు.

సంతానం కలగాలని మొక్కుకున్న వారు, తమ కోరికలు నెరవేరడంతో ముడుపులు చెల్లించుకున్నారు. భక్తుల కోసం చక్కటి ఏర్పాట్లు చేసిన మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్‌తో పాటు మున్సిపల్ సిబ్బందికి భక్తులు కృతజ్ఞతలు తెలిపారు.

ముఖేష్ గుసాయిన్

ముఖేష్ గుసాయనా 6 సంవత్సరాల జర్నలిజం అనుభవం కలిగిన డిజిటల్ న్యూస్ ఎడిటర్. JCD విద్యాపీఠ్, సిర్సా నుంచి BMC పూర్తి చేశారు. NewzFastTelugu.com ద్వారా విశ్వసనీయమైన వార్తలు మరియు ఉపయోగకరమైన సమాచారాన్ని పాఠకులకు అందించడంపై దృష్టి సారిస్తున్నారు.

Website

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

క్రీడలు

వార్తా విభాగాలు