సీఐఐ సదస్సులో ఏపీకి రూ.1.41 లక్షల కోట్ల పెట్టుబడులు

ఏపీ పెట్టుబడులు: సీఐఐ భాగస్వామ్య సదస్సు రెండో రోజు ఆంధ్రప్రదేశ్‌కు భారీ పెట్టుబడులు తరలివచ్చాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో వివిధ సంస్థలు రాష్ట్ర ప్రభుత్వంతో కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. మొత్తం 11 ఎంఓయూలు, ఒక జీవో జారీ ద్వారా రూ.1,41,585 కోట్ల పెట్టుబడులు, 10,919 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా అడుగులు పడ్డాయి. ప్రకాశం జిల్లా కందుకూరులో మైనింగ్ కార్యకలాపాల కోసం హిందాల్కో గ్రూప్ రూ.15 వేల కోట్ల పెట్టుబడులకు ముందుకొచ్చింది. ఈ ప్రాజెక్టు ద్వారా 2,500 మందికి ఉపాధి.

ఏపీ పెట్టుబడులు, NewzFast Telugu (విశాఖపట్నం): సీఐఐ భాగస్వామ్య సదస్సు రెండో రోజు ఆంధ్రప్రదేశ్‌కు భారీ పెట్టుబడులు తరలివచ్చాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో వివిధ సంస్థలు రాష్ట్ర ప్రభుత్వంతో కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.

మొత్తం 11 ఎంఓయూలు, ఒక జీవో జారీ ద్వారా రూ.1,41,585 కోట్ల పెట్టుబడులు, 10,919 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా అడుగులు పడ్డాయి. ప్రకాశం జిల్లా కందుకూరులో మైనింగ్ కార్యకలాపాల కోసం హిందాల్కో గ్రూప్ రూ.15 వేల కోట్ల పెట్టుబడులకు ముందుకొచ్చింది.

ఈ ప్రాజెక్టు ద్వారా 2,500 మందికి ఉపాధి లభించనుంది.

తిరుపతి జిల్లాలో ఆర్బిటల్ డేటా సెంటర్, రాకెట్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు అగ్నికుల్ కాస్మోస్ లిమిటెడ్ రూ.510 కోట్ల పెట్టుబడితో 350 మందికి ఉద్యోగాలు కల్పించనుంది. ఏరోస్పేస్, రక్షణ రంగంలో హాథోర్ రాకెట్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.250 కోట్ల పెట్టుబడితో 200 మందికి ఉపాధి కల్పించనుంది.

పునరుత్పాదక ఇంధన రంగంలో గ్రీన్ జెన్ రెన్యూవబుల్ ఎనర్జీ రూ.8 వేల కోట్లు, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ రూ.6,600 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నాయి. వీటి ద్వారా వరుసగా 200, 800 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి.

డేటా సెంటర్ క్యాంపస్, 1,400 మెగావాట్ల టెలికాం సెంటర్ల ఏర్పాటుకు ఎయిర్‌ట్రంక్ ఇండియా–జేసీకే ఇన్‌ఫ్రా సంస్థలు ఐటీ విభాగంతో ఒప్పందం చేసుకున్నాయి.

ఈ ప్రాజెక్టు కోసం రూ.1,03,018 కోట్ల పెట్టుబడులు పెట్టడంతో పాటు 3,120 మందికి ఉద్యోగాలు కల్పించనున్నాయి. ఎలక్ట్రానిక్స్ రంగంలో డిక్సన్ టెక్నాలజీస్ ఇండియా రూ.700 కోట్ల పెట్టుబడితో 2,300 మందికి ఉపాధి కల్పించనుంది.

కాకినాడలో మెకనైజ్డ్ బెర్త్, రీగ్యాసిఫికేషన్ యూనిట్, షిప్ బిల్డింగ్ అండ్ రిపేర్ కాంప్లెక్స్ ఏర్పాటుకు కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్ రూ.6,452 కోట్ల పెట్టుబడితో ముందుకొచ్చింది. ఈ ప్రాజెక్టు ద్వారా 852 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి.

అమరావతి ప్రాంతంలో హోటల్ ప్రాజెక్టు ఏర్పాటుకు ఒబెరాయ్ హోటల్స్ గ్రూప్‌కు చెందిన ఈఐహెచ్ లిమిటెడ్ రూ.175 కోట్ల పెట్టుబడితో 150 మందికి ఉపాధి కల్పించనుంది.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీ4 కార్యక్రమం అమలుకు సంబంధించి మరో రెండు కీలక ఒప్పందాలు కుదిరాయి. రాష్ట్రంలోని 28 జిల్లాల్లో 1,120 మంది ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు ఆర్థిక సహకారం అందించేందుకు హీరో మోటార్ కార్పొరేషన్‌తో స్వర్ణాంధ్ర ఫౌండేషన్ ఒప్పందం చేసుకుంది.

ఇందుకోసం రూ.32.48 కోట్ల ఆర్థిక సాయం అందించనున్నారు.

అలాగే రాష్ట్రవ్యాప్తంగా 100 గ్రామాల్లోని 25 వేల బంగారు కుటుంబాలను దత్తత తీసుకుని, వారి జీవనోపాధి అవకాశాలు, జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు ఐటీసీ లిమిటెడ్‌తో స్వర్ణాంధ్ర ఫౌండేషన్ ఒప్పందం కుదుర్చుకుంది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెంపొందించడంతో పాటు పేద కుటుంబాల అభ్యున్నతికి ఈ ఒప్పందాలు దోహదపడనున్నాయి.

ముఖేష్ గుసాయిన్

ముఖేష్ గుసాయనా 6 సంవత్సరాల జర్నలిజం అనుభవం కలిగిన డిజిటల్ న్యూస్ ఎడిటర్. JCD విద్యాపీఠ్, సిర్సా నుంచి BMC పూర్తి చేశారు. NewzFastTelugu.com ద్వారా విశ్వసనీయమైన వార్తలు మరియు ఉపయోగకరమైన సమాచారాన్ని పాఠకులకు అందించడంపై దృష్టి సారిస్తున్నారు.

Website

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

క్రీడలు

వార్తా విభాగాలు