చంద్రమోహన్, NewzFast Telugu: దివంగత నటుడు చంద్రమోహన్ గురించి పరిచయం అవసరం లేదు. హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, కమెడియన్‌గా వందల చిత్రాల్లో నటించి దశాబ్దాల పాటు తెలుగు ప్రేక్షకులను తన నటనతో అలరించారు.
ప్రస్తుతం టాలీవుడ్లో ఉన్న సీనియర్ నటుల కంటే చంద్రమోహన్ చాలా సీనియర్. కృష్ణ, కృష్ణంరాజు, శోభన్ బాబులకు సమకాలీకుడైన ఆయన, వారికి పోటీగా హీరోగా నటించి ఎన్నో సూపర్ హిట్స్ అందుకున్నారు.
అయితే ఆ ముగ్గురికి ఉన్నట్లుగా చంద్రమోహన్‌కు మాస్ ఇమేజ్ లేదు. క్లాస్ సినిమాలతోనే ఆయన అదరగొట్టారు.
జయసుధ, శ్రీదేవి వంటి అగ్ర హీరోయిన్లతో కలిసి నటించారు. కానీ క్రమంగా కృష్ణ, శోభన్ బాబుల క్రేజ్ పెరుగుతూ రావడంతో, క్లాస్ సినిమాలతో ఎక్కువ కాలం హీరోగా కొనసాగలేకపోయారు.
నటనలో ఆయన పలికించే హావభావాలు అద్భుతమని చెప్పాలి. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించినా, నెగిటివ్ రోల్ చేసినా ఆయన నటన ఎప్పుడూ ఆకట్టుకునేది.
చంద్రమోహన్ నటనను గుర్తు చేసుకుంటే 1998లో విడుదలైన పాపే నా ప్రాణం సినిమా ప్రస్తావనకు వస్తుంది. ఈ చిత్రంలో జేడీ చక్రవర్తి, జయసుధ, చంద్రమోహన్, ఆశిష్ విద్యార్థి ప్రధాన పాత్రల్లో నటించారు.
ఇందులో చంద్రమోహన్ నెగిటివ్ రోల్ పోషించారు. జయసుధ గవర్నర్‌గా నటించగా, ఆమె భర్తగా చంద్రమోహన్ కనిపిస్తారు.
కథలో రాజకీయ కుట్రలో భాగంగా గవర్నర్‌ను అంతం చేయాలని కొందరు భావిస్తారు. ఆ కుట్రలో ఆమె భర్త కూడా భాగమవుతాడు.
పైకి మంచి భర్తగా నటిస్తూ, తన భార్యనే అంతం చేయాలని ఆయన ప్లాన్ చేస్తారు.
క్లైమాక్స్‌లో తన ప్లాన్ అనుకున్నట్లుగా జరిగిందని, భార్య చనిపోయిందని భ్రమపడిన చంద్రమోహన్, ఆమె మృతదేహం వద్దకు వెళ్లి పైకి దుఃఖం ప్రదర్శిస్తూ ఏడుస్తారు. అదే సమయంలో కుట్ర ఫలించిందనే సంతోషంతో నవ్వుతారు.
ఈ మల్టీ షేడ్స్ నటన ఆయన ప్రతిభకు నిదర్శనం. అపరిచితుడు క్లైమాక్స్‌లో విక్రమ్ మల్టీ షేడ్స్ నటనను ఆయన చాలా ఏళ్ల క్రితమే చేసి చూపించారని చెబుతారు.
అయితే కథలో జేడీ చక్రవర్తి, జయసుధ ప్లాన్ చేసి ఆయనను బురిడీ కొట్టిస్తారు.
ఇంతటి ప్రతిభ ఉన్నప్పటికీ చంద్రమోహన్ చివరికి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానే ఎక్కువ సినిమాలు చేయాల్సి వచ్చింది. కృష్ణ, కృష్ణంరాజు, శోభన్ బాబు వంటి అగ్ర హీరోలకు పోటీ ఇవ్వలేకపోవడానికి పలు కారణాలు ఉన్నాయి.
ఆయన హైట్ కొంత వరకు కారణమైందని చెబుతారు. అదేవిధంగా చంద్రమోహన్ దూకుడు స్వభావం, వివాదాలు కూడా ఆయన కెరీర్‌పై ప్రభావం చూపాయని ప్రచారంలో ఉంది.




