కోహెన్స్ ఫార్మా మూసివేతకు సర్పంచుల డిమాండ్, కాలుష్యంపై ఆందోళన

కోహెన్స్ ఫార్మా కాలుష్యం: కోహెన్స్ సువెన్ ఫార్మాస్యూటికల్ పరిశ్రమ నుంచి వెలువడుతున్న కాలుష్యంతో పరిసర గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పలువురు సర్పంచులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల ఆరోగ్యానికి ముప్పుగా మారిన ఈ పరిశ్రమను తక్షణమే శాశ్వతంగా మూసివేసి, జనావాసాలకు దూరంగా తరలించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం హైదరాబాద్‌లోని కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయంలో తండావాసులతో కలిసి సర్పంచులు ఫిర్యాదు చేశారు. పరిశ్రమలో తరచూ ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ఫిర్యాదులు అందడంతో అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేయాలని ఆదేశించినట్లు.

కోహెన్స్ ఫార్మా కాలుష్యం, NewzFast Telugu (సూర్యాపేట రూరల్): కోహెన్స్ సువెన్ ఫార్మాస్యూటికల్ పరిశ్రమ నుంచి వెలువడుతున్న కాలుష్యంతో పరిసర గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పలువురు సర్పంచులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల ఆరోగ్యానికి ముప్పుగా మారిన ఈ పరిశ్రమను తక్షణమే శాశ్వతంగా మూసివేసి, జనావాసాలకు దూరంగా తరలించాలని డిమాండ్ చేశారు.

ఈ మేరకు గురువారం హైదరాబాద్‌లోని కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయంలో తండావాసులతో కలిసి సర్పంచులు ఫిర్యాదు చేశారు. పరిశ్రమలో తరచూ ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ఫిర్యాదులు అందడంతో అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేయాలని ఆదేశించినట్లు వారు తెలిపారు.

అయినప్పటికీ పరిశ్రమ యాజమాన్యం సోలార్ విద్యుత్ సహాయంతో కార్యకలాపాలు కొనసాగిస్తోందని సర్పంచులు ఆరోపించారు. అధికారుల ఆదేశాలను సైతం పట్టించుకోకపోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు.

గత కొన్నేళ్లుగా పరిశ్రమ నుంచి వెలువడుతున్న విషపూరిత కాలుష్యం, దుర్వాసనతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

పరిశ్రమలో జరుగుతున్న ప్రమాదాల వల్ల పలువురు ప్రాణాలు కోల్పోయారని సర్పంచులు ఆరోపించారు. పరిశ్రమను మూసివేయాలని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, ప్రజాప్రతినిధులు పలుమార్లు డిమాండ్ చేసినా యాజమాన్యం పట్టించుకోవడం లేదని విమర్శించారు.

ప్రజల ప్రాణాలు, ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పరిశ్రమను వెంటనే మూసివేయాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో జాటోత్ తండా, కాసరబాద, ఇమాంపేట, కేసారం, రామ్ల తండా, రూప్ల తండా, తాళ్లఖమ్మంపహాడ్, కేటీ అన్నారం సర్పంచులతో పాటు పలువురు తండావాసులు పాల్గొన్నారు.

ముఖేష్ గుసాయిన్

ముఖేష్ గుసాయనా 6 సంవత్సరాల జర్నలిజం అనుభవం కలిగిన డిజిటల్ న్యూస్ ఎడిటర్. JCD విద్యాపీఠ్, సిర్సా నుంచి BMC పూర్తి చేశారు. NewzFastTelugu.com ద్వారా విశ్వసనీయమైన వార్తలు మరియు ఉపయోగకరమైన సమాచారాన్ని పాఠకులకు అందించడంపై దృష్టి సారిస్తున్నారు.

Website

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

క్రీడలు

వార్తా విభాగాలు