ఆంధ్రప్రదేశ్ రోడ్ ట్రిప్స్, NewzFast Telugu (ఆంధ్రప్రదేశ్): ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ రోడ్డు ప్రయాణం చేయాలనుకునేవారికి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నో అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి. పొగమంచు కప్పుకున్న కొండలు, పచ్చని అడవులు, అందమైన జలపాతాలు, లోతైన లోయలు ఒక్కో ప్రాంతానికి ఒక్కో ప్రత్యేక అనుభూతిని అందిస్తాయి.
ముఖ్యంగా తూర్పు కనుమల అందాల మధ్య సాగే రోడ్ ట్రిప్‌లు పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. అలాంటి వాటిలో ఐదింటి గురించి ఇక్కడ తెలుసుకుందాం.
1. విశాఖపట్నం – అరకు – లంబసింగి: ఆంధ్రప్రదేశ్‌లోని అత్యంత అందమైన రోడ్ ట్రిప్‌లలో విశాఖపట్నం నుంచి అరకు మీదుగా లంబసింగి వెళ్లే మార్గం ఒకటి. సుమారు 115 కిలోమీటర్ల దూరంలో ఉన్న అరకు చేరుకోవడానికి దాదాపు 3.5 గంటల సమయం పడుతుంది.
మధ్యలో కనిపించే కొండలు, హెయిర్ పిన్ మలుపులు, కాఫీ తోటలు ప్రయాణాన్ని మరింత అందంగా మారుస్తాయి.
అరకు సమీపంలోని బొర్రా గుహలు, చాపరాయి జలపాతం తప్పక చూడాల్సిన ప్రదేశాలు. అక్కడి నుంచి లంబసింగి వెళ్తే పొగమంచుతో కప్పుకున్న లోయలు, చల్లని వాతావరణం, స్ట్రాబెర్రీ తోటలు కనువిందు చేస్తాయి.
ఈ ప్రయాణానికి అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు మంచి సమయంగా చెబుతారు.
2. నల్లమల ఫారెస్ట్ – శ్రీశైలం: అడవుల మధ్య ప్రయాణం ఇష్టపడేవారికి నల్లమల అడవి మీదుగా శ్రీశైలం వెళ్లే మార్గం మంచి ఎంపిక. దట్టమైన చెట్లు, కొండల మధ్య మలుపులు, కృష్ణా నది అందాలు ఈ ప్రయాణంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.
శ్రీశైలం డ్యామ్, చుట్టుపక్కల లోయల దృశ్యాలు పర్యాటకులకు మంచి అనుభూతిని ఇస్తాయి.
అయితే ఈ మార్గంలో రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఫారెస్ట్ రూట్ గేట్లు మూసివేస్తారు. కాబట్టి ప్రయాణాన్ని ముందుగానే ప్లాన్ చేసుకోవడం అవసరం.
3. రాజమండ్రి – మారేడుమిల్లి: పచ్చని ప్రకృతి, జలపాతాలు చూడాలనుకునేవారు రాజమండ్రి నుంచి మారేడుమిల్లి ప్రయాణాన్ని ఎంచుకోవచ్చు. గోదావరి ప్రాంతం నుంచి తూర్పు కనుమల అడవుల్లోకి సాగే ఈ మార్గంలో వెదురు చెట్లు, అందమైన కొండలు కనిపిస్తాయి.
అమృతధార జలపాతం, శోలేరు వాగు వ్యూ పాయింట్ సందర్శకులను ఆకట్టుకుంటాయి. స్థానిక గిరిజన వంటకాలనూ రుచి చూడవచ్చు.
4. గండికోట – బెలూం గుహలు: చారిత్రక ప్రదేశాలు, ప్రకృతి అందాలు రెండింటినీ చూడాలనుకునేవారికి గండికోట మంచి ఎంపిక. పెన్నా నది మధ్యలో ఏర్పడిన లోతైన ఎర్రటి రాతి లోయను చూడటం ప్రత్యేక అనుభూతిని ఇస్తుంది.
ఇక్కడి చారిత్రక కోటతో పాటు బెలూం గుహలను కూడా సందర్శించవచ్చు.
5. బెంగళూరు – హార్స్లీ హిల్స్: చల్లని వాతావరణం, కొండల అందాలు ఇష్టపడేవారు హార్స్లీ హిల్స్‌కు వెళ్లవచ్చు. యూకలిప్టస్ చెట్ల మధ్య సాగే మలుపుల రహదారులు, అందమైన సూర్యాస్తమయ దృశ్యాలు ఈ ప్రయాణానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.




