జెన్సన్ హువాంగ్, NewzFast Telugu (అమెరికా): 33 ఏళ్లుగా ఎన్విడియా అంటే జెన్సన్ హువాంగ్, జెన్సన్ హువాంగ్ అంటే ఎన్విడియా అన్నట్లుగా సాగిన బంధానికి తెరపడింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) చిప్‌ల ప్రపంచాన్ని శాసిస్తున్న ఈ టెక్ దిగ్గజం వ్యవస్థాపకుడు, సీఈఓ జెన్సన్ హువాంగ్ (63) గురువారం ఉదయం తన పదవికి, బోర్డు సభ్యత్వానికి రాజీనామా చేశారు.
కేవలం 40,000 డాలర్ల పెట్టుబడితో ఒక రెస్టారెంట్‌లో ప్రారంభమైన ఎన్విడియాను 4.5 ట్రిలియన్ డాలర్ల సామ్రాజ్యంగా మార్చిన ఆయన ఆకస్మిక నిష్క్రమణకు కంపెనీ ఎలాంటి కారణం చెప్పలేదు. అయితే ఈ రాజీనామా వెనుక రెండు వారాలుగా బహిరంగంగా, అంతకు చాలా కాలంగా తెరవెనుక సాగుతున్న ఒక పెను తుఫాను ఉందని నివేదికలు పేర్కొంటున్నాయి.
ఒక వ్యక్తిగత అఫైర్, జాతీయ భద్రతకు సంబంధించిన గూఢచర్యం ఆరోపణలే ఈ అనూహ్య పరిణామాలకు దారితీశాయని వార్తలు చెబుతున్నాయి.
1963లో తైపీలో జన్మించి, థాయ్‌లాండ్‌లో పెరిగి, తర్వాత అమెరికాకు వలస వెళ్లిన జెన్సన్ హువాంగ్ కఠినమైన పరిస్థితుల్లో చదువుకుని, ఒరెగాన్ స్టేట్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. 1993లో ఇద్దరు స్నేహితులతో కలిసి సిలికాన్ వ్యాలీలోని ఒక డెన్నీస్ రెస్టారెంట్‌లో, సాధారణ కంప్యూటర్లు పరిష్కరించలేని సమస్యలను పరిష్కరించాలనే లక్ష్యంతో ఎన్విడియాకు ప్రాణం పోశారు.
వీడియో గేమ్స్ గ్రాఫిక్స్ కోసం వారు రూపొందించిన గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్లు (జీపీయూలు), అనూహ్యంగా చాట్‌జీపీటీ వంటి జనరేటివ్ ఏఐ టెక్నాలజీకి వెన్నెముకగా మారాయి. దీంతో ఎన్విడియా దశ పూర్తిగా మారిపోయింది.
డిమాండ్‌కు సరిపడా చిప్‌లను సరఫరా చేయలేనంత స్థాయికి కంపెనీ ఎదిగింది.




