ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రమాదాలు, NewzFast Telugu (హైదరాబాద్): ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలోని నవజాత శిశువుల వార్డులో జరిగిన అగ్నిప్రమాదం, వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో పైకప్పు కూలిన ఘటనలపై హైకోర్టు సుమోటో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) నమోదు చేసింది.
ఈ ప్రమాదాలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కును ఉల్లంఘించడమేనని పేర్కొంటూ హైదరాబాద్‌కు చెందిన న్యాయవాది నల్లపు మణిదీప్ రాసిన లేఖను పిల్‌గా పరిశీలించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ హైకోర్టుకు పంపారు.
దీనిపై విచారణ చేపట్టిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శ్యామ్‌కోషీ, జస్టిస్ చలపతిరావులతో కూడిన ధర్మాసనం, తదుపరి విచారణలోగా కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ఆరోగ్య శాఖలకు ఆదేశాలు జారీ చేసింది.
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో భద్రతా ఆడిట్, ఐసీయూల ఆధునీకరణ, బాధితులకు పరిహారం ఇవ్వాలని న్యాయవాది మణిదీప్ తన లేఖలో కోరారు.




