వ్యవసాయ వర్సిటీ వీసీ జానయ్యను తొలగించి విచారణ జరపాలని డిమాండ్

వ్యవసాయ వర్సిటీ వీసీ జానయ్య: రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ అల్దాస్ జానయ్యను పదవి నుంచి తొలగించి విచారణ జరపాలని వివిధ పార్టీలు, పలు సంఘాల నేతలు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడాలని, లేదంటే అధికార పక్షం కాలగర్భంలో కలిసిపోతుందని హెచ్చరించారు. గురువారం వ్యవసాయ విశ్వవిద్యాలయ కళాశాల ఎదుట ధర్నాచౌక్ వద్ద వీసీ జానయ్య లైంగిక వేధింపులకు గురైన మహిళా అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు పెద్ద ఎత్తున పలువురు సంఘీభావం తెలుపుతూ నిరసనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా.

వ్యవసాయ వర్సిటీ వీసీ జానయ్య, NewzFast Telugu (రాజేంద్రనగర్, తెలంగాణ): రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ అల్దాస్ జానయ్యను పదవి నుంచి తొలగించి విచారణ జరపాలని వివిధ పార్టీలు, పలు సంఘాల నేతలు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడాలని, లేదంటే అధికార పక్షం కాలగర్భంలో కలిసిపోతుందని హెచ్చరించారు.

గురువారం వ్యవసాయ విశ్వవిద్యాలయ కళాశాల ఎదుట ధర్నాచౌక్ వద్ద వీసీ జానయ్య లైంగిక వేధింపులకు గురైన మహిళా అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు పెద్ద ఎత్తున పలువురు సంఘీభావం తెలుపుతూ నిరసనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీలు వీఎస్‌ఎన్ఆర్ రెడ్డి, అంజిరెడ్డి మాట్లాడుతూ, అవసరమైతే జాతీయ స్థాయి కమిటీలతో విచారణ జరిపిస్తామని చెప్పారు.

వర్సిటీ మహిళా ప్రొఫెసర్లు ఆత్మగౌరవం కోసం రోడ్డెక్కి వారం రోజులైనా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వారు విమర్శించారు. బాధితురాలు రోడ్డున పడినప్పుడే పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ జరపాల్సి ఉన్నదని గుర్తుచేశారు.

బీఆర్ఎస్ రాజేంద్రనగర్ నియోజకవర్గ ఇన్‌చార్జి కార్తీక్‌రెడ్డి మాట్లాడుతూ, వీసీ జానయ్య ఉన్నత పదవికి అనర్హుడని అన్నారు. వీసీ చాంబర్‌లో సీసీ ఫుటేజీ ఎందుకు తప్పించారని ప్రశ్నించారు.

బాధితురాలికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు.

బాధితురాలి నిరసనకు బీఆర్ఎస్, ఏబీవీపీ, విద్యార్థి సంఘాలు, అధ్యాపకులు, ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి. విద్యార్థి సంఘాల నాయకులు వంటావార్పు ఏర్పాటు చేసి రోజంతా అక్కడే బైఠాయించారు.

వీసీని బర్తరఫ్ చేసి బాధితురాలికి న్యాయం చేయాలని తెలంగాణ సైంటిస్ట్ అసోసియేషన్ (టాసా) సహా విశ్వవిద్యాలయ టీచింగ్, నాన్-టీచింగ్ సిబ్బంది ఆందోళనలో పాల్గొన్నారు.

ముఖేష్ గుసాయిన్

ముఖేష్ గుసాయనా 6 సంవత్సరాల జర్నలిజం అనుభవం కలిగిన డిజిటల్ న్యూస్ ఎడిటర్. JCD విద్యాపీఠ్, సిర్సా నుంచి BMC పూర్తి చేశారు. NewzFastTelugu.com ద్వారా విశ్వసనీయమైన వార్తలు మరియు ఉపయోగకరమైన సమాచారాన్ని పాఠకులకు అందించడంపై దృష్టి సారిస్తున్నారు.

Website

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

క్రీడలు

వార్తా విభాగాలు