పాఠశాల విద్యాశాఖ పోస్టుల కేటాయింపు, NewzFast Telugu (ఆంధ్రప్రదేశ్): రాష్ట్రపతి ఉత్తర్వులు-2025 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖకు పోస్టులను కేటాయించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
పాఠశాల విద్యాశాఖలో మొత్తం 1,86,273 పోస్టులు ఉన్నాయి. వాటిలో 1,61,369 మంది పనిచేస్తుండగా, మరో 24,904 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
జిల్లాల వారీగా పోస్టులు కేటాయిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఈ ఉత్తర్వుల ఆధారంగా కొత్త జిల్లాల్లో ఉద్యోగులు, ఉపాధ్యాయుల విభజన ప్రక్రియ చేపడతారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల సంఖ్య ఆధారంగా పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేస్తుంది.
ప్రస్తుతం ఉన్న జిల్లాలోనే కొనసాగితే నియామక ఆదేశాలు, వేరే జిల్లాకు మారితే బదిలీ ఆదేశాలు ఇస్తారు. అనారోగ్య సమస్యలు, ఇతర కొన్ని కేటగిరీలను ప్రాధాన్యతా జాబితాలో చేర్చారు.
ఇకపై కేడర్ స్ట్రెంథ్ ఆధారంగానే ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నారు.


