ఒవైసీ కొత్త కూటమి యూపీ ఎన్నికలు, NewzFast Telugu (లక్నో): వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కీలక రాజకీయ వ్యూహానికి తెరలేపారు.
యూపీకి చెందిన అజాద్ సమాజ్ పార్టీ (కాన్షీరామ్) అధ్యక్షుడు చంద్రశేఖర్ ఆజాద్‌తో కలిసి ‘సామాజిక్ పరివర్తన్ మోర్చా’ పేరిట కొత్త కూటమిని ఏర్పాటు చేశారు. గురువారం లక్నోలో ఆజాద్‌తో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఒవైసీ ఈ వివరాలను వెల్లడించారు.
కూటమి చీఫ్ ప్రెసిడెంట్‌గా, సీఎం అభ్యర్థిగా చంద్రశేఖర్ ఆజాద్ వ్యవహరిస్తారని ఒవైసీ తెలిపారు. యూపీలో బీజేపీ మూడోసారి అధికారంలోకి రాకుండా అడ్డుకోవడమే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
తమ కూటమిలోకి రావాలని సమాజ్‌వాదీ, కాంగ్రెస్ పార్టీలకు ఆజాద్ ఆహ్వానం పలికారు.




