బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్త బెయిల్, NewzFast Telugu (తిమ్మాపూర్, కరీంనగర్ జిల్లా): కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణకాలనీకి చెందిన బీఆర్ఎస్ సోషల్‌మీడియా యాక్టివిస్ట్ సిరికొండ శ్యాంసుందర్‌రావుకు హైదరాబాద్ నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
ఇటీవల ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై పలు వ్యాఖ్యలు చేశారు. దానికి కౌంటర్‌గా శ్యాంసుందర్‌రావు ఎమ్మెల్సీ వెంకట్ వివాహంపై ఫేస్బుక్లో పోస్ట్ పెట్టారు.
దీంతో ఆయన భార్య ఫిర్యాదు చేయగా, హైదరాబాద్‌లో అట్రాసిటీ కేసు నమోదైంది.
కేసు నేపథ్యంలో పోలీసులు పది రోజులుగా కాపు కాసి శ్యాంసుందర్‌రావును పట్టుకుని బుధవారం హైదరాబాద్ నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు. సమాచారం అందుకున్న మాజీ ఎంపీ వినోద్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణరావు లీగల్ సెల్ న్యాయవాది లలితకు సమాచారం అందించారు.
బీఆర్ఎస్ లీగల్ సెల్ బృందం కోర్టులో తమ వాదనలు వినిపించగా, శ్యాంసుందర్‌రావు రిమాండ్‌ను జడ్జి తిరస్కరించి బెయిల్ మంజూరు చేశారు. బెయిల్ వచ్చేలా కృషి చేసిన బీఆర్ఎస్ నాయకులు, లీగల్‌సెల్ బృందానికి సర్పంచుల ఫోరం మండలాధ్యక్షురాలు పొన్నం సునీతాఅనిల్గౌడ్ మరియు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.




