ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు, NewzFast Telugu: రాష్ట్రంలో తీవ్ర ఉత్కంఠ రేపిన మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ మంగళవారం ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. రాష్ట్రవ్యాప్తంగా 92 పట్టణ స్థానిక సంస్థలకు జరిగిన ఈ ఎన్నికల ఫలితాలు రాత్రి 8 గంటల కల్లా వెలువడే అవకాశం ఉంది.
ఇందుకోసం రాష్ట్ర ఎన్నికల సంఘం 138 కౌంటింగ్ కేంద్రాలను సిద్ధం చేసింది. 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 79 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లోని మొత్తం 3,186 వార్డులకు నవంబర్ 1న పోలింగ్ జరిగింది.
ఈ ఎన్నికల్లో 96,89,061 మంది ఓటర్లకు గాను 60,22,411 మంది (62.16 శాతం) తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం 556 కౌంటింగ్ హాళ్లు, 6,831 టేబుళ్లను ఏర్పాటు చేసి, 47,817 మంది సిబ్బందిని నియమించారు.
అత్యధికంగా గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్‌కు 10 కేంద్రాల్లో లెక్కింపు జరగనుంది. స్ట్రాంగ్ రూమ్‌లు, కౌంటింగ్ కేంద్రాల వద్ద 1,372 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు.
మొత్తం ప్రక్రియను వీడియో రికార్డింగ్ చేస్తున్నారు.
ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కించి, ఆ తర్వాత బ్యాలెట్ పత్రాలను 25 చొప్పున కట్టలు కట్టి లెక్కింపు చేపడతారు. ఈ ఎన్నికల్లో అధికార టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి, ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మధ్య హోరాహోరీ పోరు నెలకొంది.

