ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లు, NewzFast Telugu (ఫ్యూచర్ సిటీ): అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించనున్న ఇన్వెస్ట్ తెలంగాణ ప్రపంచ సదస్సును విజయవంతం చేయడానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని మంత్రి జి.వివేక్ వెంకటస్వామి అధికారులను ఆదేశించారు.
డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో నిర్వహించే ఈ సదస్సుకు వేదికగా ఉన్న ఫ్యూచర్ సిటీ పరిధిలోని మీర్‌ఖాన్‌పేటలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ భవన నిర్మాణ పనులను సోమవారం ఆయన పరిశీలించారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా నిర్ణీత గడువులోగా అన్ని పనులను పూర్తి చేయాలని మంత్రి సూచించారు.
దేశ, విదేశాల నుంచి వచ్చే ప్రముఖులు, ప్రతినిధులకు అసౌకర్యం కలగకుండా సదుపాయాలు కల్పించాలని ఆయన ఆదేశించారు. ప్రముఖుల భద్రతకు సంబంధించి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని కూడా సూచించారు.
