సుందర్ పిచాయ్, NewzFast Telugu: ప్రపంచ టెక్నాలజీ రంగాన్ని శాసిస్తున్న భారతీయ సంతతి కార్పొరేట్ దిగ్గజాల జాబితాలో అరుదైన పరిణామం చోటుచేసుకుంది. తాజాగా విడుదలైన ‘హెచ్ఎస్బీసీ హురున్ గ్లోబల్ ఇండియన్స్ లిస్ట్ 2026’లో సత్య నాదెళ్లను వెనక్కి నెట్టి, ఆల్ఫాబెట్ (గూగుల్) సీఈఓ సుందర్ పిచాయ్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిజిటల్ అడ్వర్టైజింగ్ రంగాలలో దూకుడుగా పెట్టుబడులు పెట్టడం వల్ల ఆల్ఫాబెట్ మార్కెట్ విలువ ఏకంగా 98 శాతం పెరిగి 4.2 ట్రిలియన్ డాలర్ల (రూ. 395.01 లక్షల కోట్లు)కు చేరుకుంది.
మరోవైపు, 2024లో అగ్రస్థానంలో నిలిచిన సత్య నాదెళ్ల నేతృత్వంలోని మైక్రోసాఫ్ట్ విలువ 17 శాతం తగ్గి 2.6 ట్రిలియన్ డాలర్ల (రూ. 244.53 లక్షల కోట్లు)కు పరిమితమైంది. మైక్రాన్ టెక్నాలజీ అధినేత సంజయ్ మెహ్రోత్రా 1.4 ట్రిలియన్ డాలర్ల (రూ. 131.67 లక్షల కోట్లు) కంపెనీ విలువతో మూడో స్థానంలో నిలిచారు.
ఈ జాబితాలోని అగ్రశ్రేణి ఐదు కంపెనీల మొత్తం విలువే 9.1 ట్రిలియన్ డాలర్లు (రూ. 855.86 లక్షల కోట్లు)గా ఉండటం, గ్లోబల్ మార్కెట్‌పై భారతీయ నేతల ఆధిపత్యానికి నిదర్శనమని చెప్పవచ్చు.




