మంచిర్యాల వయోజన విద్యాశాఖ, NewzFast Telugu (మంచిర్యాల): మంచిర్యాల జిల్లా వయోజన విద్యాశాఖ జిల్లా ఇన్‌చార్జిగా నూతనంగా నియమితులైన ఏ. పురుషోత్తం గురువారం బాధ్యతలు స్వీకరించారు.
అనంతరం ఆయన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్‌ను మర్యాదపూర్వకంగా కలిసి తన నియామక వివరాలను తెలియజేశారు. ఈ సందర్భంగా పురుషోత్తం మాట్లాడుతూ, జిల్లాలో వయోజన విద్యా కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తానని చెప్పారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాల మేరకు ULLAS – నవ భారత్ సాక్షరత కార్యక్రమం ద్వారా నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానన్నారు. ప్రజల్లో విద్యపై అవగాహన పెంపొందించడంతో పాటు సంబంధిత శాఖల సమన్వయంతో కార్యక్రమాలను విజయవంతం చేస్తానని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రిసోర్స్ పర్సన్లు ఏ. సత్యనారాయణమూర్తి, ఎం.
సుమన్ తదితరులు పాల్గొని ఏ. పురుషోత్తంకు శుభాకాంక్షలు తెలిపారు.




