డిఫెన్సర్ సెక్యూరిటీ లైసెన్స్ రద్దు, NewzFast Telugu (తెలంగాణ): తెలంగాణ రాష్ట్రంలో డిఫెన్సర్ సెక్యూరిటీ సర్వీసెస్ లైసెన్స్‌ను ప్రభుత్వం రద్దు చేసింది. నిబంధనలు ఉల్లంఘించి పోలీస్ వెరిఫికేషన్, సరైన శిక్షణ లేకుండానే సెక్యూరిటీ గార్డులను నియమించడంపై ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది.
కౌకూర్‌లో ఐదేళ్ల చిన్నారి హత్య కేసులో ఈ సంస్థకు చెందిన సెక్యూరిటీ గార్డు విధుల్లో ఉండటాన్ని కూడా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని లైసెన్స్ రద్దు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఆదేశాల ప్రకారం, సంస్థ తక్షణమే తన కార్యకలాపాలను నిలిపివేయాలి. అంతేకాకుండా ఏడు రోజుల్లోగా అసలు లైసెన్స్‌ను ప్రభుత్వానికి అప్పగించాలని స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలో ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలు నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని తెలంగాణ పోలీస్ శాఖ హెచ్చరించింది. రాష్ట్రంలో ఎక్కడైనా అనధికారికంగా ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు ఉంటాయని ప్రభుత్వం స్పష్టమైన హెచ్చరిక జారీ చేసింది.




