దివ్యభారతి, NewzFast Telugu (సినిమా): జబర్ధస్త్ ఫేమ్ సుడిగాలి సుధీర్ హీరోగా నటించిన తాజా చిత్రం G.O.A.T. నవంబరు 12న థియేటర్లలో విడుదలైంది.
దివ్యభారతి హీరోయిన్గా నటించిన ఈ చిత్రానికి వేదవ్యాస్ దర్శకత్వం వహించారు.
మహాతేజ క్రియేషన్స్ అండ్ జైష్ణవ్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ ఏషియన్ సినిమాస్ సమర్పణలో విడుదల చేశారు. విడుదల సందర్భంగా ఆడియన్స్‌తో కలిసి సినిమాను ఆస్వాదించిన దివ్యభారతి తన ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.
“నా మొదటి తెలుగు సినిమా.. ప్రేక్షకుల మధ్య ఫస్ట్ డే, ఫస్ట్ షో చూడటం నాకు ఎంతో ప్రత్యేకమైన అనుభవం.
ప్రేక్షకుల నుంచి లభించే ఈ ప్రేమ నిజంగా అద్భుతమైనది,” అని ఆమె పేర్కొన్నారు. వారు సినిమాను ఆస్వాదిస్తుంటే చూడటం, కృతజ్ఞతా భావంతో వారిని సాగనంపడం ఈ అనుభూతిని మాటల్లో వర్ణించలేనని తెలిపారు.
గోట్ సినిమా వెనుక ఎంతో మంది కఠిన శ్రమ, ప్రేమ ఉన్నాయని, ప్రేక్షకులు థియేటర్లలో సినిమాను చూసి తమ బృందానికి మద్దతు ఇవ్వాలని దివ్యభారతి కోరారు. అందరం కలిసి సినిమాను సంబరంగా జరుపుకుందాం అంటూ ఆమె వీడియో ముగించారు.




