బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీల అరెస్ట్ కేసు హైకోర్టులో, NewzFast Telugu (హైదరాబాద్): అసెంబ్లీ సమావేశాల సందర్భంగా స్పీకర్‌ను అసభ్య పదజాలంతో దూషించిన కేసులో నిందితులుగా ఉన్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు తాత మధు, నవీన్‌కుమార్‌రెడ్డిలను విచారణ నిమిత్తం అరెస్ట్ చేసేందుకు అవకాశం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును కోరింది.
వారికి నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేయగా, దాన్ని రద్దు చేయాలని కోరుతూ ప్రభుత్వం క్రిమినల్ అప్పీల్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై సోమవారం జస్టిస్ మధుసూదన్‌రావు ధర్మాసనం విచారణ చేపట్టింది.
ప్రభుత్వం, పోలీసుల తరఫున స్టేట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వర్‌రావు వాదనలు వినిపించారు. ఇద్దరు ఎమ్మెల్సీలు ఉద్దేశపూర్వకంగా స్పీకర్‌ను అసభ్య పదజాలంతో దూషించారని ఆయన పేర్కొన్నారు.
అందువల్ల దిగువ కోర్టు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు.
బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీల తరఫు న్యాయవాది మాత్రం తమ క్లయింట్లు స్పీకర్‌ను దూషించలేదని వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది.
