చిరంజీవి మెగా వర్స్, NewzFast Telugu: మెగాస్టార్ చిరంజీవి హీరోగా తన నటనతో వెండితెరపై ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా, వ్యాఖ్యాతగా కూడా అభిమానులను ఆకట్టుకున్నారు. ఇప్పటికే ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షో ద్వారా హోస్ట్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన, త్వరలో ‘మెగా వర్స్’ అనే టాక్ షో ద్వారా మరోసారి అలరించనున్నారు.
ఈ టాక్ షో నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానుందని ఆ సంస్థ ఇప్పటికే అధికారికంగా వెల్లడించింది. కార్యక్రమంలో భాగంగా కొన్ని ఎపిసోడ్ల చిత్రీకరణ పూర్తయినట్లు సమాచారం.
అయితే ఈ షో ఎప్పటి నుంచి ప్రసారం అవుతుందనే విషయంపై అభిమానుల్లో ఎన్నో సందేహాలు ఉన్నాయి.
తాజా సమాచారం ప్రకారం, ఈ టాక్ షో తొలి ఎపిసోడ్ డిసెంబర్ రెండో వారాంతంలో ప్రసారం కానుంది. స్ట్రీమింగ్ తేదీని త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.
తొలి ఎపిసోడ్లో టాలీవుడ్ అక్కినేని కుటుంబం సందడి చేయనుందని సమాచారం. అక్కినేని నాగార్జునతో పాటు ఆయన కుమారులు నాగచైతన్య, అఖిల్ ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారని తెలుస్తోంది.
అన్నపూర్ణ స్టూడియోలో ఈ ఎపిసోడ్ చిత్రీకరణ పూర్తయిందని, ఈ సందర్భంగా నాగచైతన్య వ్యక్తిగత జీవితం, సోషల్ మీడియాలో వచ్చిన విమర్శల గురించి నాగార్జున మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారని సమాచారం.
మరోవైపు చిరంజీవి సినిమాల్లోనూ బిజీగా ఉన్నారు. దర్శకుడు బాబీ దర్శకత్వంలో ‘కాక’ అనే చిత్రం షూటింగ్ వేగంగా జరుగుతోంది.
సంక్రాంతి సందర్భంగా జనవరి 13న ఈ సినిమా విడుదల కానుందని నిర్మాతలు ప్రకటించినప్పటికీ, సమయానికి వస్తుందా లేదా అనే సందేహాలు అభిమానుల్లో ఉన్నాయి.




