భారత్ సమ్మిట్, NewzFast Telugu: భారత్ సమ్మిట్ వెనుక రాజకీయ కుట్ర ఉందంటూ బీజేపీ నేత రామచంద్రరావు చేసిన వ్యాఖ్యలను ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతు రావు తప్పుబట్టారు.
ప్రపంచ దేశాల నుంచి పెట్టుబడుల కోసం ప్రతినిధులు ఇక్కడికి వస్తుంటే అందులో రాజకీయ కుట్ర ఎలా ఉంటుందని ఆయన ప్రశ్నించారు.
విదేశాల నుంచి వచ్చే వారు తమకు ఓట్లు వేస్తారా? ఇందులో రాజకీయ దురుద్దేశం ఏముందని ఆయన నిలదీశారు.
ఇప్పటికే బీజేపీ ఉన్న ఓట్లనే చోరీ చేస్తోందని, అలాంటిది విదేశాల నుంచి వచ్చేవారు ఓట్లు వేస్తారా అని ఎద్దేవా చేశారు.
బీసీలకు న్యాయం జరిగితే రాహుల్ గాంధీ ఎక్కడ ప్రధానమంత్రి అవుతారోనని బీజేపీ భయపడుతోందని, అందుకే జనగణనలో ఓబీసీ కాలమ్ పెట్టకుండా సెన్సస్ నిర్వహిస్తోందని ఆయన ఆరోపించారు. బీజేపీకి బీసీల ఓట్లు కావాలి కానీ బీసీలకు న్యాయం చేయడం లేదని మండిపడ్డారు.
సర్దార్ వల్లభాయ్ పటేల్ భారత్‌ను విడగొట్టాలని చెప్పారా అని ప్రశ్నించిన ఆయన, బీజేపీ మతం పేరుతో రాజకీయాలు ఎందుకు చేస్తోందని నిలదీశారు.




