గ్లెన్‌ఉడ్ జాస్కిన్ జూనియర్ గిన్నిస్ రికార్డ్, NewzFast Telugu (యార్క్ హెవెన్, అమెరికా): అమెరికాలోని పెన్సిల్వేనియాకు చెందిన గ్లెన్‌ఉడ్ జాస్కిన్ జూనియర్(60) ఒక సంవత్సరంలో అత్యధిక సినిమాలు చూసిన వ్యక్తిగా గిన్నిస్ రికార్డ్ సృష్టించారు.
2024 ఏప్రిల్ నుంచి 2025 ఏప్రిల్ మధ్యకాలంలో యార్క్ హెవెన్‌లోని రీగల్ సినిమా థియేటర్‌లో ఆయన 1,207 సినిమాలు చూసి ఈ ఘనత సాధించారు. సినిమాలు చూసేందుకు ఒక్కోసారి తెల్లవారుజామునే థియేటర్‌కు వచ్చి అర్ధరాత్రి వరకు అక్కడే ఉండేవారు.
ఇంటి బయట ఉండటం తనకు నిజంగా చాలా ఆనందంగా అనిపించిందని, దీన్ని ఎల్లప్పుడూ ఒక సవాల్‌గా భావించానని జాస్కిన్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌కు తెలిపారు. ఒకే సినిమాను ఎక్కువసార్లు వీక్షించిన రికార్డు కూడా ఆయన సొంతం చేసుకున్నారు.
ఇన్ని సినిమాలు చూసినా ఏ సినిమా తనకు నచ్చలేదని చెప్పలేదని ఆయన పేర్కొన్నారు.

