కరీంనగర్ ప్రభుత్వ పాఠశాలల్లో నూతన టాయిలెట్లు ప్రారంభం

కరీంనగర్ ప్రభుత్వ పాఠశాలల్లో నూతన టాయిలెట్లు: కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో మలయప్ప ఫౌండేషన్ సహకారంతో సిఎస్ఆర్ నిధులతో కరీంనగర్ లోని కొత్తపల్లి, మల్కాపూర్, శాంతినగర్ ప్రభుత్వ పాఠశాలల్లో నూతనంగా నిర్మించిన టాయిలెట్లను ప్రారంభించారు. ఈ టాయిలెట్లను నగర మేయర్ కొలగానే శ్రీనివాస్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, డిప్యూటీ మేయర్, మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా.

కరీంనగర్ ప్రభుత్వ పాఠశాలల్లో నూతన టాయిలెట్లు, NewzFast Telugu (కరీంనగర్): కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో మలయప్ప ఫౌండేషన్ సహకారంతో సిఎస్ఆర్ నిధులతో కరీంనగర్ లోని కొత్తపల్లి, మల్కాపూర్, శాంతినగర్ ప్రభుత్వ పాఠశాలల్లో నూతనంగా నిర్మించిన టాయిలెట్లను ప్రారంభించారు.

ఈ టాయిలెట్లను నగర మేయర్ కొలగానే శ్రీనివాస్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, డిప్యూటీ మేయర్, మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా 10వ తరగతి విద్యార్థుల పరీక్ష ఫీజును బండి సంజయ్ కుమార్ చెల్లించారని తెలిపారు.

త్వరలోనే ప్రభుత్వ పాఠశాలలో చదివే పదవ తరగతి విద్యార్థులకు సైకిళ్లను కూడా పంపిణీ చేయబోతున్నారని ఆయన చెప్పారు. టాయిలెట్లను పరిశుభ్రంగా ఉంచుతూ మంచిగా వాడుకోవాలని విద్యార్థులకు సూచించారు.

ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు కష్టపడి చదువుకొని మంచి భవిష్యత్తు సాధించాలని కూడా ఆయన ప్రోత్సహించారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు వాసాల రమేష్, వేముల కవిత చంద్రశేఖర్, కాంతాల జగన్ రెడ్డి, పిట్టల జ్యోతి విష్ణు, బండ రమణారెడ్డి, బిజెపి మండల నాయకులు హరీష్, మాజీ ఎంపీటీసీ శివకుమార్, సత్తిరెడ్డి, డీఈఓ వై.తిరుపతి రావు, ప్లానింగ్ కోఆర్డినేటర్ మిల్కూరి శ్రీనివాస్, ప్రధానోపాధ్యాయులు కన్నం రమేష్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

ముఖేష్ గుసాయిన్

ముఖేష్ గుసాయనా 6 సంవత్సరాల జర్నలిజం అనుభవం కలిగిన డిజిటల్ న్యూస్ ఎడిటర్. JCD విద్యాపీఠ్, సిర్సా నుంచి BMC పూర్తి చేశారు. NewzFastTelugu.com ద్వారా విశ్వసనీయమైన వార్తలు మరియు ఉపయోగకరమైన సమాచారాన్ని పాఠకులకు అందించడంపై దృష్టి సారిస్తున్నారు.

Website

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

క్రీడలు

వార్తా విభాగాలు