రాయచోటి విద్యార్థి అమరవీరుల వర్ధంతి, NewzFast Telugu (రాయచోటి, అన్నమయ్య జిల్లా): అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని మాసాపేటలో ఉన్న శ్రీనివాస ఐటీఐ కళాశాలలో గురువారం విద్యార్థి అమరవీరుల వర్ధంతి సభ నిర్వహించారు.
ఈ సందర్భంగా కళాశాల విద్యార్థులతో కలిసి అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.
అంకన్న మాట్లాడుతూ, శాస్త్రీయ విద్య, సమసమాజ స్థాపన, విద్యార్థుల హక్కుల సాధన కోసం పోరాడి ప్రాణాలర్పించిన అమరవీరుల ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు.
నేటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగంపై అవలంబిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా విద్యార్థులు ఐక్యంగా ఉద్యమించాలని ఆయన అన్నారు. విద్య ప్రతి ఒక్కరి ప్రాథమిక హక్కని, విద్యను వ్యాపార వస్తువుగా మార్చే విధానాలను తిప్పికొట్టాలని పేర్కొన్నారు.
ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేసి, విద్యార్థులందరికీ నాణ్యమైన విద్య అందించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు కేవలం చదువుకే పరిమితం కాకుండా సమాజంలోని అసమానతలు, అన్యాయాలపై ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని సూచించారు.
అమరవీరుల త్యాగాలు, పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని విద్యార్థి ఉద్యమాలను మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. అలాగే SIR ప్రక్రియను తక్షణమే రద్దు చేయాలని, కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి జ్ఞానేశ్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో రాణా ప్రతాప్, రెడ్డి భాష, రెడ్డి గౌతమ్, అద్నాన్, రఫీ, మణికంఠ, సాంబ, లోకనాథ్ రెడ్డి, హసేన్, గణేష్, యూసుఫ్, అబూ సర్, హనుమంతు తదితరులు పాల్గొన్నారు.




