Telangana government additional Rs 3,000 crore loan through RBI bond auction, NewzFast Telugu (Telangana): రాష్ట్ర ఆర్థిక అవసరాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి అప్పుల బాట పట్టింది. రిజర్వ్ బ్యాంక్ మంగళవారం నిర్వహించే సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా మరో రూ.3,000 కోట్ల రుణ సమీకరణకు సిద్ధమైంది.
తెలంగాణ ఆర్థిక శాఖ ఇండెంట్ పెట్టినట్టు ఆర్‌బీఐ వెల్లడించింది. దీంతో ప్రస్తుత 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు ఆర్‌బీఐ నుంచి తెచ్చిన అప్పులు రూ.53,900 కోట్లకు చేరుకుంటాయి.
ఈ మొత్తం రాష్ట్ర వార్షిక రుణ లక్ష్యం రూ.61,457.16 కోట్లలో 87.70 శాతానికిపైగా. దీంతో వచ్చే ఏడాది మార్చి నెలాఖరుకు తీసుకోవాల్సిన రుణం రూ.7,557.16 కోట్లు మాత్రమే మిగులుతుంది.
ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో రూ.18,900 కోట్లు, జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో రూ.27,500 కోట్ల రుణాలు సమీకరించారు. కేవలం ఏడు నెలల్లోనే వార్షిక లక్ష్యంలో ఎక్కువ భాగం వినియోగించడంపై ఆర్థిక స్థితిగతులపై ప్రశ్నలు తలెత్తుతున్నాయని సోర్స్ పేర్కొంది.

