Asifabad farmer suicide over debt and crop losses, NewzFast Telugu (Jainoor, Kumuram Bheem Asifabad district): కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం బూసిమెట్ట గ్రామానికి చెందిన రైతు గొట్టేకర్ సూర్యభాన్ (55) అప్పులు తీర్చే మార్గం లేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
గ్రామస్తుల కథనం ప్రకారం, సూర్యభాన్కు బూసిమెట్ట క్యాంప్‌లో మూడెకరాలు ఉండగా, జామ్ని గ్రామంలో ఏడెకరాలు కౌలుకు తీసుకుని పత్తి తదితర పంటలు సాగు చేశాడు. పెట్టుబడి కోసం రెండున్నర లక్షల వరకు అప్పు చేశాడు.
వర్షాలు పడకపోవడంతో దిగుబడిపై ప్రభావం పడింది. పెట్టుబడులైనా తిరిగి వస్తాయో లేదోనని ఆయన మనస్తాపం చెందినట్టు చెబుతున్నారు.
ఈ క్రమంలో సోమవారం పురుగుల మందు తాగాడు.
కుటుంబసభ్యులు వెంటనే ఆదిలాబాద్‌లోని రిమ్స్‌కు తరలించగా, చికిత్స పొందుతూ ఆయన మృతిచెందాడు. ఈ ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై రవికుమార్ తెలిపారు.

