చిరంజీవి, NewzFast Telugu: మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ ప్రారంభ దశలో చిన్న పాత్రల్లో కూడా నటించారు. తర్వాత చిన్న సినిమాల్లో హీరోగా నటిస్తూ క్రమంగా ఎదిగారు.
కెరీర్ ప్రారంభంలో ఆయన తమ్మారెడ్డి భరద్వాజ నిర్మాణంలో వచ్చిన కోతల రాయుడు చిత్రంలో నటించారు, ఈ సినిమా మంచి విజయం సాధించింది.
ప్రముఖ కమెడియన్ బాబు మోహన్ చిరంజీవి హీరోగా నటించిన ఎన్నో చిత్రాల్లో నటించారు. చిరంజీవితో ఆయన నటించిన తొలి చిత్రం కూడా కోతల రాయుడే.
ఆ సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య ఆసక్తికర సంఘటన జరిగిందని బాబు మోహన్ వెల్లడించారు.
షూటింగ్‌కు వెళ్ళినప్పుడు తనకు హీరో ఎవరో తెలియదని బాబు మోహన్ చెప్పారు. చెట్టు కింద ఒక వ్యక్తి సామాన్యుడిలా నిలబడి ఉండటం చూసి, అతను షూటింగ్ చూడటానికి వచ్చిన ప్రేక్షకుడని భావించారు.
ఈ సినిమా హీరో ఎవరని అడగగా, ఆయనే చిరంజీవి అని సమాధానం ఇచ్చారు. అప్పుడు ఆయన కొన్ని సినిమాల్లో నటించారన్న విషయం గుర్తొచ్చి, ధన్యవాదాలు చెప్పి పక్కకు వెళ్లినట్లు తెలిపారు.
ఆ సినిమాలోని ఒక ఎమోషనల్ పాటలో చిరంజీవి ప్రదర్శన చూసి, భవిష్యత్తులో ఆయన నంబర్ 1 స్థాయికి చేరుతారని అప్పుడే అనుకున్నానని బాబు మోహన్ చెప్పారు. తన అంచనా నిజమైందని ఆయన పేర్కొన్నారు.
చిరంజీవిని మీరు ఎప్పుడూ పేరు పెట్టి పిలవరట, దానికి కారణం ఏమిటని అడగగా, తాను ఎప్పుడూ ఆయనను ‘చిరు అన్నయ్య’ అనే పిలుస్తానని బాబు మోహన్ తెలిపారు. ఆయన్ని పేరుతో పిలిస్తే అన్నం తిన్నట్లు ఉండదని, అలా అలవాటు అయిందని ఆయన చెప్పారు.




