రోడ్ల విస్తరణ పనులకు ప్రజలు సహకరించాలి: ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

రోడ్ల విస్తరణ: రోడ్డు విస్తరణకు ప్రజలు సహకరించాలని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి విజ్ఞప్తి చేశారు. గురువారం ఉదయం ఆయన పట్టణంలోని కొత్త బస్టాండ్ సమీపంలో పొట్టి శ్రీరాములు చౌరస్తా పరిసర ప్రాంతాలలో చేపడుతున్న రహదారుల విస్తరణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. విస్తరణ పనులను మరింత వేగవంతం చేసి నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. పనుల నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడకుండా, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. వనపర్తి పట్టణాన్ని అభివృద్ధి పథంలో ముందుకు.

రోడ్ల విస్తరణ, NewzFast Telugu (వనపర్తి): రోడ్డు విస్తరణకు ప్రజలు సహకరించాలని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి విజ్ఞప్తి చేశారు. గురువారం ఉదయం ఆయన పట్టణంలోని కొత్త బస్టాండ్ సమీపంలో పొట్టి శ్రీరాములు చౌరస్తా పరిసర ప్రాంతాలలో చేపడుతున్న రహదారుల విస్తరణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

విస్తరణ పనులను మరింత వేగవంతం చేసి నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. పనుల నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడకుండా, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.

వనపర్తి పట్టణాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలంటే రోడ్ల విస్తరణ ఎంతో కీలకమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. భవిష్యత్తులో పెరుగుతున్న వాహనాల రద్దీకి అనుగుణంగా పట్టణంలో మెరుగైన రవాణా వ్యవస్థను కల్పించడమే లక్ష్యమని తెలిపారు.

పట్టణ అభివృద్ధి ఒక్కరి బాధ్యత కాదని, ప్రతి ఒక్కరి భాగస్వామ్యంతోనే సాధ్యమవుతుందని ఆయన అన్నారు. రోడ్డు విస్తరణ పనులకు పట్టణ ప్రజలు, వ్యాపారులు మనస్ఫూర్తిగా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

వనపర్తి అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో వనపర్తి మున్సిపల్ చైర్మన్ మాధవి, వైస్ చైర్మన్ మధుసూదన్ గౌడ్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కదిరె రాములు, స్థానిక కౌన్సిలర్ రవి యాదవ్, జిల్లా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ బ్రహ్మచారి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వాకిటి ఆదిత్య, మున్సిపల్ మాజీ చైర్మన్ పుట్టపాకుల మహేష్, మాజీ వైస్ చైర్మన్ బి. కృష్ణ, పాకనాటి కృష్ణ, కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎస్‌ఎల్‌ఎన్ రమేష్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ముఖేష్ గుసాయిన్

ముఖేష్ గుసాయనా 6 సంవత్సరాల జర్నలిజం అనుభవం కలిగిన డిజిటల్ న్యూస్ ఎడిటర్. JCD విద్యాపీఠ్, సిర్సా నుంచి BMC పూర్తి చేశారు. NewzFastTelugu.com ద్వారా విశ్వసనీయమైన వార్తలు మరియు ఉపయోగకరమైన సమాచారాన్ని పాఠకులకు అందించడంపై దృష్టి సారిస్తున్నారు.

Website

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

క్రీడలు

వార్తా విభాగాలు