బంగారం ధరలు, NewzFast Telugu (హైదరాబాద్): ఇటీవల ఆకాశాన్నంటుతూ సామాన్యులకు చుక్కలు చూపించిన బంగారం ధరలు ఇవాళ భారీగా దిగివచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో నెలకొన్న పరిస్థితులు, డాలర్ విలువలో హెచ్చుతగ్గుల నేపథ్యంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో పసిడి ధరలు గణనీయంగా తగ్గాయి.
24 క్యారెట్ల 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధరపై ఏకంగా రూ.2,180 తగ్గి, ప్రస్తుతం రూ.1,39,800 వద్ద ట్రేడ్ అవుతోంది. అదేవిధంగా ఆభరణాల తయారీలో వినియోగించే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.2,000 తగ్గి, రూ.1,28,150 పలుకుతోంది.
మరోవైపు వెండి ధరలో మాత్రం ఇవాళ ఎలాంటి మార్పు కనిపించలేదు. హైదరాబాద్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.2 లక్షల వద్ద స్థిరంగా కొనసాగుతోంది.
పెళ్లిళ్లు, శుభకార్యాల సీజన్ నేపథ్యంలో బంగారం ధరలు ఒక్కసారిగా దిగిరావడం కొనుగోలుదారులకు పెద్ద ఊరటనిస్తోంది. అయితే, పైన పేర్కొన్న ధరలు కేవలం ప్రాథమిక మార్కెట్ రేట్లు మాత్రమే.
వీటిపై 3 శాతం జీఎస్టీ అదనంగా వర్తిస్తుంది. అంతేకాకుండా, వివిధ ప్రాంతాలు, జ్యువెలరీ షోరూమ్‌లను బట్టి తరుగు, మేకింగ్ చార్జీలతో స్వల్ప మార్పులు ఉంటాయి.




