నిబంధనలు పాటించని 18 నిర్మాణ సంస్థలకు పీసీబీ నోటీసులు, ఒక ఆర్‌ఎంసీ ప్లాంట్‌ మూసివేత

కాలుష్య నియంత్రణ మండలి నిర్మాణ ప్రాజెక్టులు: నిబంధనలు పాటించకుండా కొనసాగుతున్న నిర్మాణ ప్రాజెక్టులు, ఆర్‌ఎంసీ (రెడీమిక్స్‌ కాంక్రీట్‌) ప్లాంట్‌లపై తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి కఠిన చర్యలకు సిద్ధమైంది. ఒక నిర్మాణ ప్రాజెక్టుకు అనుబంధంగా పనిచేస్తున్న ఆర్‌ఎంసీ ప్లాంట్‌కు మూసివేత ఉత్తర్వులు జారీ చేయగా, మరో ప్రాజెక్టు పనులను నిలిపివేయాలని బుధవారం జరిగిన టాస్క్‌ఫోర్స్‌ కమిటీ సమావేశంలో నిర్ణయించారు. గ్రేటర్‌ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో నిర్మాణ ప్రాజెక్టుల వల్ల వాయు కాలుష్యం ఏర్పడుతోందని స్థానికుల నుంచి ఫిర్యాదులు అందిన నేపథ్యంలో టీజీపీసీబీ టాస్క్‌ఫోర్స్‌.

కాలుష్య నియంత్రణ మండలి నిర్మాణ ప్రాజెక్టులు, NewzFast Telugu (హైదరాబాద్): నిబంధనలు పాటించకుండా కొనసాగుతున్న నిర్మాణ ప్రాజెక్టులు, ఆర్‌ఎంసీ (రెడీమిక్స్‌ కాంక్రీట్‌) ప్లాంట్‌లపై తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి కఠిన చర్యలకు సిద్ధమైంది. ఒక నిర్మాణ ప్రాజెక్టుకు అనుబంధంగా పనిచేస్తున్న ఆర్‌ఎంసీ ప్లాంట్‌కు మూసివేత ఉత్తర్వులు జారీ చేయగా, మరో ప్రాజెక్టు పనులను నిలిపివేయాలని బుధవారం జరిగిన టాస్క్‌ఫోర్స్‌ కమిటీ సమావేశంలో నిర్ణయించారు.

గ్రేటర్‌ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో నిర్మాణ ప్రాజెక్టుల వల్ల వాయు కాలుష్యం ఏర్పడుతోందని స్థానికుల నుంచి ఫిర్యాదులు అందిన నేపథ్యంలో టీజీపీసీబీ టాస్క్‌ఫోర్స్‌ బృందాలు ఆయా ప్రాజెక్టులను తనిఖీ చేశాయి. నిర్మాణ ప్రాజెక్టుల చుట్టూ కనీసం 10 మీటర్ల ఎత్తులో విండ్‌ బ్రేకింగ్‌ వాల్స్‌ ఏర్పాటు చేయకపోవడంతో దుమ్ము, ధూళి పరిసర ప్రాంతాలకు వ్యాపిస్తున్నట్లు గుర్తించారు.

అంతర్గత రహదారులు, పాదచారుల మార్గాలు, ప్రధాన రహదారులపై దుమ్ము పేరుకుపోవడంతో వాయు కాలుష్యం పెరిగి పరిసర ప్రాంతాల్లో గాలి నాణ్యత క్షీణిస్తోందని నివేదికలో పేర్కొన్నారు. అదేవిధంగా, నిర్మాణ ప్రాజెక్టుల వద్ద నమోదైన శబ్ద స్థాయిలు వాణిజ్య ప్రాంతాలకు నిర్దేశించిన పగటిపూట పరిమితి 65 డెసిబెల్స్‌ కంటే అధికంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

వ్యర్థాలను నిబంధనల ప్రకారం తొలగించకపోవడం, వాటి నిర్వహణ రికార్డులను ఎప్పటికప్పుడు పీసీబీకి సమర్పించకపోవడం వంటి అంశాలను అధికారులు తీవ్రంగా పరిగణించారు. తనిఖీ చేసిన మొత్తం 18 ప్రాజెక్టుల నిబంధనల అమలు తీరును సమీక్షించిన టాస్క్‌ఫోర్స్‌ కమిటీ, తీవ్ర ఉల్లంఘనలకు పాల్పడిన ప్రాజెక్టులకు పర్యావరణ పరిహారం విధించాలని నిర్ణయించింది.

స్వల్ప ఉల్లంఘనలకు పాల్పడిన ప్రాజెక్టుల బ్యాంకు గ్యారెంటీలను జప్తు చేయాలని సిఫారసు చేసింది.

కొన్ని ప్రాజెక్టుల్లో బయటపడిన లోపాలను సరిదిద్దుకునేందుకు 10 రోజుల గడువు విధించారు. సభ్య కార్యదర్శి గుగులోతు రవి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో చీఫ్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజనీర్‌ బి.రఘు, జాయింట్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజనీర్‌ జవహర్‌లాల్‌, సీనియర్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజనీర్‌ ప్రసన్నరాణి, ఈఈ రవిశంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

ముఖేష్ గుసాయిన్

ముఖేష్ గుసాయనా 6 సంవత్సరాల జర్నలిజం అనుభవం కలిగిన డిజిటల్ న్యూస్ ఎడిటర్. JCD విద్యాపీఠ్, సిర్సా నుంచి BMC పూర్తి చేశారు. NewzFastTelugu.com ద్వారా విశ్వసనీయమైన వార్తలు మరియు ఉపయోగకరమైన సమాచారాన్ని పాఠకులకు అందించడంపై దృష్టి సారిస్తున్నారు.

Website

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

క్రీడలు

వార్తా విభాగాలు