వ్యవసాయ విశ్వవిద్యాలయ వీసీపై లైంగిక వేధింపుల ఆరోపణలు, విచారణకు గవర్నర్ ఆదేశం

వీసీ లైంగిక వేధింపుల ఆరోపణలు: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆల్దాస్ జానయ్యపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణల వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. ఓ మహిళా ప్రొఫెసర్‌ను లైంగికంగా వేధించారన్న ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని గవర్నర్ శవప్రతాప్ శుక్లా ఆదేశాలు జారీ చేశారు. గవర్నర్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం నలుగురు సభ్యులతో కూడిన ఉన్నత స్థాయి విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఎండీ కె.లక్ష్మీ అధ్యక్షతన ఏర్పాటైన ఈ కమిటీలో.

వీసీ లైంగిక వేధింపుల ఆరోపణలు, NewzFast Telugu (తెలంగాణ): ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆల్దాస్ జానయ్యపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణల వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. ఓ మహిళా ప్రొఫెసర్‌ను లైంగికంగా వేధించారన్న ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని గవర్నర్ శవప్రతాప్ శుక్లా ఆదేశాలు జారీ చేశారు.

గవర్నర్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం నలుగురు సభ్యులతో కూడిన ఉన్నత స్థాయి విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఎండీ కె.లక్ష్మీ అధ్యక్షతన ఏర్పాటైన ఈ కమిటీలో ఐఏఎస్ అధికారులు గోపి, రాహుల్ రాజ్, ‘ప్రజ్వల’ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి సునీతా కృష్ణన్ సభ్యులుగా ఉన్నారు.

ఈ కేసుపై లోతుగా విచారణ జరిపి 15 రోజుల్లోగా సమగ్ర నివేదికను అందజేయాలని, అలాగే బాధిత మహిళా ప్రొఫెసర్ భద్రతకు తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.

మరోవైపు, తనపై జరిగిన వేధింపుల గురించి డీజీపీకి ఫిర్యాదు చేసి 15 రోజులు దాటినా ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిందితుడిని ప్రభుత్వ పెద్దలు కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఆమె ఆరోపిస్తున్నారు.

ఈ ఘటనకు నిరసనగా విశ్వవిద్యాలయంలో విద్యార్థులు, ఉద్యోగ సంఘాలు ఆందోళనలు చేపట్టడంతో పాటు గవర్నర్ జోక్యం చేసుకోవడంతో కమిటీని ఏర్పాటు చేయక తప్పని పరిస్థితి నెలకొంది.

ఇదిలా ఉండగా, ఈ వ్యవహారాన్ని సుమోటోగా స్వీకరించిన రాష్ట్ర మహిళా కమిషన్ సైతం విచారణను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా విచారణకు హాజరు కావాలని వైస్ ఛాన్సలర్ ఆల్దాస్ జానయ్యను మహిళా కమిషన్ ఆదేశించడంతో ఆయన ఇవాళ కమిషన్ ఎదుట హాజరు కానున్నారు.

ముఖేష్ గుసాయిన్

ముఖేష్ గుసాయనా 6 సంవత్సరాల జర్నలిజం అనుభవం కలిగిన డిజిటల్ న్యూస్ ఎడిటర్. JCD విద్యాపీఠ్, సిర్సా నుంచి BMC పూర్తి చేశారు. NewzFastTelugu.com ద్వారా విశ్వసనీయమైన వార్తలు మరియు ఉపయోగకరమైన సమాచారాన్ని పాఠకులకు అందించడంపై దృష్టి సారిస్తున్నారు.

Website

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

క్రీడలు

వార్తా విభాగాలు