రోషన్ మేక యాక్షన్ అడ్వెంచర్ చిత్రం, NewzFast Telugu (తెలంగాణ): అశోక క్రియేషన్స్ బ్యానర్‌పై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఓ భారీ ప్రాజెక్ట్ బుధవారం ప్రారంభమైంది. క్రియేటివ్ డైరెక్టర్ మోహనకృష్ణ ఇంద్రగంటి, యంగ్ సెన్సేషన్ రోషన్ మేక ఈ ప్రాజెక్ట్ కోసం చేతులు కలిపారు.
ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్ర ప్రారంభ వేడుకలో ఆయన కెమెరా స్విచ్ ఆన్ చేయగా, హీరో శ్రీకాంత్ క్లాప్ కొట్టారు. అనంతరం ముప్పా వెంకయ్య చౌదరి చిత్ర బృందానికి స్క్రిప్ట్ అందజేశారు.
దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి రోషన్ మేకను గతంలో ఎన్నడూ చూడని పవర్ ఫుల్ సూపర్‌హీరో అవతార్‌లో చూపించేందుకు భారీ స్థాయి యాక్షన్ అడ్వెంచర్ కథను సిద్ధం చేశారు. ఈ సినిమాతో బాలీవుడ్ నటి రేఖా పాండే తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతున్నారు.
నటుడు వినయ్ రాయ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా షూటింగ్ డిసెంబర్ మొదటి వారంలో ప్రారంభం కానుంది.




