తిరుమలలో సర్వదర్శనానికి 12 గంటల సమయం.. క్యూలైన్ శిలాతోరణం వరకు
తిరుమల శ్రీవారి సర్వదర్శనం: తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి ప్రస్తుతం 12 గంటల సమయం పడుతోందని సమాచారం. బుధవారం సాయంత్రం 4 గంటల వరకు అందిన వివరాల ప్రకారం, వైకుంఠం క్యూకాంప్లెక్స్-2లోని 31 కంపార్టుమెంట్లలో, నారాయణగిరిలోని 9 షెడ్లలో సర్వదర్శన భక్తులు నిండిపోయారు. దీంతో క్యూలైన్ శిలాతోరణం సర్కిల్ వరకు విస్తరించింది. వైకుంఠం క్యూకాంప్లెక్స్-1లోని 6 కంపార్టుమెంట్లలో టైంస్లాట్ భక్తులు వేచివున్నారు. సోమవారం హుండీ ఆదాయం రూ.3.93 కోట్లుగా నమోదైంది. మంగళవారం శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 78,085గా ఉండగా, తలనీలాలు సమర్పించిన వారు 26,232.
తిరుమల శ్రీవారి సర్వదర్శనం, NewzFast Telugu (తిరుమల, తిరుపతి): తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి ప్రస్తుతం 12 గంటల సమయం పడుతోందని సమాచారం. బుధవారం సాయంత్రం 4 గంటల వరకు అందిన వివరాల ప్రకారం, వైకుంఠం క్యూకాంప్లెక్స్-2లోని 31 కంపార్టుమెంట్లలో, నారాయణగిరిలోని 9 షెడ్లలో సర్వదర్శన భక్తులు నిండిపోయారు.
దీంతో క్యూలైన్ శిలాతోరణం సర్కిల్ వరకు విస్తరించింది. వైకుంఠం క్యూకాంప్లెక్స్-1లోని 6 కంపార్టుమెంట్లలో టైంస్లాట్ భక్తులు వేచివున్నారు.
సోమవారం హుండీ ఆదాయం రూ.3.93 కోట్లుగా నమోదైంది. మంగళవారం శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 78,085గా ఉండగా, తలనీలాలు సమర్పించిన వారు 26,232 మంది ఉన్నారు.