దేశంలోనే తొలి ఏఐ ఆధారిత పోలీస్ స్టేషన్‌గా పంజాగుట్ట

పంజాగుట్ట ఏఐ పోలీస్ స్టేషన్: దేశంలోనే తొలిసారిగా ఏఐ ఆధారిత పోలీసింగ్ సేవలను పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో పైలెట్ ప్రాజెక్టుగా అందుబాటులోకి తేనున్నట్లు హైదరాబాద్ సీపీ సజ్జనార్ వెల్లడించారు. ఈ క్రమంలో పోలీస్ స్టేషన్‌లో జరుగుతున్న ఆధునికీకరణ పనులను ఆయన బుధవారం ఆకస్మికంగా పరిశీలించారు. డీజీపీ సీవీ ఆనంద్ ఆలోచన మేరకు రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ సేవల్లో ఏఐ సాంకేతికతను విస్తృతంగా వినియోగించాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును చేపట్టినట్లు ఆయన తెలిపారు. సాంకేతిక ఏర్పాట్లు, పోలీస్ రికార్డులను తనిఖీ చేసిన సీపీ, అధికారులకు పలు సూచనలు.

పంజాగుట్ట ఏఐ పోలీస్ స్టేషన్, NewzFast Telugu (హైదరాబాద్): దేశంలోనే తొలిసారిగా ఏఐ ఆధారిత పోలీసింగ్ సేవలను పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో పైలెట్ ప్రాజెక్టుగా అందుబాటులోకి తేనున్నట్లు హైదరాబాద్ సీపీ సజ్జనార్ వెల్లడించారు.

ఈ క్రమంలో పోలీస్ స్టేషన్‌లో జరుగుతున్న ఆధునికీకరణ పనులను ఆయన బుధవారం ఆకస్మికంగా పరిశీలించారు. డీజీపీ సీవీ ఆనంద్ ఆలోచన మేరకు రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ సేవల్లో ఏఐ సాంకేతికతను విస్తృతంగా వినియోగించాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును చేపట్టినట్లు ఆయన తెలిపారు.

సాంకేతిక ఏర్పాట్లు, పోలీస్ రికార్డులను తనిఖీ చేసిన సీపీ, అధికారులకు పలు సూచనలు చేశారు. ఫిర్యాదు స్వీకరణ నుంచి దర్యాప్తు, ఛార్జిషీట్ రూపకల్పన వరకు పోలీసింగ్‌లోని ప్రతి దశలోనూ ఏఐ సాంకేతికతను వినియోగించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

ముఖేష్ గుసాయిన్

ముఖేష్ గుసాయనా 6 సంవత్సరాల జర్నలిజం అనుభవం కలిగిన డిజిటల్ న్యూస్ ఎడిటర్. JCD విద్యాపీఠ్, సిర్సా నుంచి BMC పూర్తి చేశారు. NewzFastTelugu.com ద్వారా విశ్వసనీయమైన వార్తలు మరియు ఉపయోగకరమైన సమాచారాన్ని పాఠకులకు అందించడంపై దృష్టి సారిస్తున్నారు.

Website

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

క్రీడలు

వార్తా విభాగాలు