శాసనమండలిలో ప్రతిపక్షం అవసరమన్న కవిత

శాసనమండలి ప్రతిపక్షం: రాష్ట్ర శాసనమండలిలో ప్రస్తుతం ప్రతిపక్షం అవసరమని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. మండలిలో ప్రస్తుతం ప్రతిపక్షం లేని పరిస్థితి నెలకొందని ఆమె పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ సభ్యులు సగానికిపైగా కాంగ్రెస్‌లో చేరారని, బీజేపీ సభ్యులు కాంగ్రెస్‌తో లోపాయికారి ఒప్పందంలో ఉన్నారని కవిత ఆరోపించారు. తెలంగాణ రక్షణ సేన తరఫున పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న నలమాస శ్రీకాంత్‌ గౌడ్‌, ఆకాశ్‌ కొల్లూరితో కలిసి బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్లు డబ్బులు తీసుకొని ఓటు.

శాసనమండలి ప్రతిపక్షం, NewzFast Telugu (హైదరాబాద్): రాష్ట్ర శాసనమండలిలో ప్రస్తుతం ప్రతిపక్షం అవసరమని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. మండలిలో ప్రస్తుతం ప్రతిపక్షం లేని పరిస్థితి నెలకొందని ఆమె పేర్కొన్నారు.

బీఆర్‌ఎస్‌ సభ్యులు సగానికిపైగా కాంగ్రెస్‌లో చేరారని, బీజేపీ సభ్యులు కాంగ్రెస్‌తో లోపాయికారి ఒప్పందంలో ఉన్నారని కవిత ఆరోపించారు. తెలంగాణ రక్షణ సేన తరఫున పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న నలమాస శ్రీకాంత్‌ గౌడ్‌, ఆకాశ్‌ కొల్లూరితో కలిసి బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్లు డబ్బులు తీసుకొని ఓటు వేస్తారని కాంగ్రెస్‌ భావిస్తోందని కవిత ఆరోపించారు. రూ.200 కోట్లు ఖర్చు పెట్టయినా సరే తమ అభ్యర్థులను గెలిపించుకుంటామని ముఖ్యమంత్రి చెబుతున్నారని ఆమె పేర్కొన్నారు.

డబ్బులు తీసుకొని తమను గెలిపిస్తారనే రాజకీయ నాయకుల అపవాదును తొలగించుకోవాల్సిన అవసరం గ్రాడ్యుయేట్లకు ఉందని ఈ సందర్భంగా ఆమె పిలుపునిచ్చారు. పట్టభద్రులు హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ స్థానం నుంచి ఆకాశ్‌ కొల్లూరిని, నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానం నుంచి శ్రీకాంత్‌ గౌడ్‌ను గెలిపించాలని ఆమె కోరారు.

సామాజిక న్యాయంలో భాగంగా తాము ఇద్దరు బీసీలకు అవకాశం కల్పించామని కవిత తెలిపారు.

ముఖేష్ గుసాయిన్

ముఖేష్ గుసాయనా 6 సంవత్సరాల జర్నలిజం అనుభవం కలిగిన డిజిటల్ న్యూస్ ఎడిటర్. JCD విద్యాపీఠ్, సిర్సా నుంచి BMC పూర్తి చేశారు. NewzFastTelugu.com ద్వారా విశ్వసనీయమైన వార్తలు మరియు ఉపయోగకరమైన సమాచారాన్ని పాఠకులకు అందించడంపై దృష్టి సారిస్తున్నారు.

Website

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

క్రీడలు

వార్తా విభాగాలు