మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో రోషన్ మేక సూపర్ హీరో పాన్ ఇండియా చిత్రం ప్రారంభం

మోహనకృష్ణ ఇంద్రగంటి: క్రియేటివ్ డైరెక్టర్ మోహనకృష్ణ ఇంద్రగంటి ఒక సూపర్ హీరో చిత్రాన్ని రూపొందించబోతున్నారు. రోషన్ మేక కథానాయకుడిగా నటిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రాన్ని అశోక క్రియేషన్స్ పతాకంపై అశోక్‌వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం బుధవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి హీరో శ్రీకాంత్ క్లాప్ ఇవ్వగా, ముప్పా వెంకయ్య చౌదరి కెమెరా స్విచ్ఛాన్ చేశారు. ప్రపంచస్థాయి ప్రమాణాలతో, అత్యాధునిక సాంకేతిక హంగులతో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు మేకర్స్ తెలిపారు. వీఎఫ్‌ఎక్స్ వర్క్‌కు అధిక ప్రాధాన్యత ఉంటుందని, డిసెంబర్.

మోహనకృష్ణ ఇంద్రగంటి, NewzFast Telugu (హైదరాబాద్): క్రియేటివ్ డైరెక్టర్ మోహనకృష్ణ ఇంద్రగంటి ఒక సూపర్ హీరో చిత్రాన్ని రూపొందించబోతున్నారు. రోషన్ మేక కథానాయకుడిగా నటిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రాన్ని అశోక క్రియేషన్స్ పతాకంపై అశోక్‌వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మిస్తున్నారు.

ఈ చిత్రం బుధవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి హీరో శ్రీకాంత్ క్లాప్ ఇవ్వగా, ముప్పా వెంకయ్య చౌదరి కెమెరా స్విచ్ఛాన్ చేశారు.

ప్రపంచస్థాయి ప్రమాణాలతో, అత్యాధునిక సాంకేతిక హంగులతో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు మేకర్స్ తెలిపారు. వీఎఫ్‌ఎక్స్ వర్క్‌కు అధిక ప్రాధాన్యత ఉంటుందని, డిసెంబర్ మొదటి వారంలో చిత్రీకరణ ప్రారంభమవుతుందని చెప్పారు.

ఈ చిత్రం ద్వారా బాలీవుడ్ నటి రేఖా పాండే తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు. ఈ చిత్రానికి కెమెరా: పీజీ విందా, సంగీతం: గౌరహరి, ప్రొడక్షన్ డిజైన్: రామకృష్ణ సబ్బాని, మోనికా నిగోట్రే, రచన-దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి.

ముఖేష్ గుసాయిన్

ముఖేష్ గుసాయనా 6 సంవత్సరాల జర్నలిజం అనుభవం కలిగిన డిజిటల్ న్యూస్ ఎడిటర్. JCD విద్యాపీఠ్, సిర్సా నుంచి BMC పూర్తి చేశారు. NewzFastTelugu.com ద్వారా విశ్వసనీయమైన వార్తలు మరియు ఉపయోగకరమైన సమాచారాన్ని పాఠకులకు అందించడంపై దృష్టి సారిస్తున్నారు.

Website

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

క్రీడలు

వార్తా విభాగాలు