హనుమకొండలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల నిరసన

హనుమకొండ డిప్యూటీ సీఎం నిరసన: హనుమకొండ పర్యటనలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు నిరసన సెగ తగిలింది. తమ సమస్యలు పరిష్కరించాలని నెల రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) ఉద్యోగులు బుధవారం కాజీపేట నుంచి హనుమకొండకు వెళ్తున్న డిప్యూటీ సీఎంకు ప్లకార్డులతో నిరసన తెలిపారు. హనుమకొండ పట్టణంలో ఓ ప్రైవేట్ దవాఖాన ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసిన ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు "మీ కాళ్లు మొక్కుతాం... మా సమస్యలు పరిష్కరించండి" అని వేడుకున్నారు. ఉద్యోగులు.

హనుమకొండ డిప్యూటీ సీఎం నిరసన, NewzFast Telugu (హనుమకొండ): హనుమకొండ పర్యటనలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు నిరసన సెగ తగిలింది. తమ సమస్యలు పరిష్కరించాలని నెల రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) ఉద్యోగులు బుధవారం కాజీపేట నుంచి హనుమకొండకు వెళ్తున్న డిప్యూటీ సీఎంకు ప్లకార్డులతో నిరసన తెలిపారు.

హనుమకొండ పట్టణంలో ఓ ప్రైవేట్ దవాఖాన ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసిన ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు “మీ కాళ్లు మొక్కుతాం… మా సమస్యలు పరిష్కరించండి” అని వేడుకున్నారు.

ఉద్యోగులు ఆయన కాళ్లపై పడి కన్నీటి పర్యంతమయ్యారు.

ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు డిప్యూటీ సీఎం కాళ్లు మొక్కుతున్న క్రమంలో ఓ పోలీస్ అధికారి మహిళా ఉద్యోగిని చేయిపట్టుకొని లాగడం ఉద్రిక్తతకు దారితీసింది.

ముఖేష్ గుసాయిన్

ముఖేష్ గుసాయనా 6 సంవత్సరాల జర్నలిజం అనుభవం కలిగిన డిజిటల్ న్యూస్ ఎడిటర్. JCD విద్యాపీఠ్, సిర్సా నుంచి BMC పూర్తి చేశారు. NewzFastTelugu.com ద్వారా విశ్వసనీయమైన వార్తలు మరియు ఉపయోగకరమైన సమాచారాన్ని పాఠకులకు అందించడంపై దృష్టి సారిస్తున్నారు.

Website

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

క్రీడలు

వార్తా విభాగాలు