సిద్ధు జొన్నలగడ్డ, NewzFast Telugu (హైదరాబాద్): హీరో సిద్ధు జొన్నలగడ్డ నటిస్తున్న పదవ చిత్రం బుధవారం ప్రారంభమైంది. పొయెటిక్ లవ్‌స్టోరీగా తెరకెక్కనున్న ఈ చిత్రం ద్వారా మోహన్.బి దర్శకుడిగా పరిచయమవుతున్నారు.
సుకుమార్ రైటింగ్స్, బన్నీ వాస్ వర్క్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. నయన్ సారిక కథానాయికగా నటిస్తున్నారు.
ముహూర్తపు సన్నివేశానికి అగ్ర దర్శకుడు సుకుమార్ కెమెరా స్విచ్ఛాన్ చేయగా, అల్లు అరవింద్ క్లాప్ కొట్టారు.
ఈ సందర్భంగా విడుదల చేసిన థీమ్ పోస్టర్ సినిమా కథా ప్రపంచాన్ని ఆవిష్కరిస్తూ పొయెటిక్ ఫీల్‌తో ఆకట్టుకుంది. సుకుమార్ బృందంలో కీలక సభ్యుడిగా ఉన్న దర్శకుడు మోహన్.బి ఈ సినిమా కోసం అందమైన, కవితాత్మక భావనలతో సాగే ప్రేమకథను సిద్ధం చేశారని, సిద్ధు జొన్నలగడ్డ పాత్ర చిత్రణ నవ్యరీతిలో ఉంటుందని మేకర్స్ తెలిపారు.
షూటింగ్ త్వరలో ప్రారంభంకానున్న ఈ చిత్రానికి కెమెరా: చంద్రు సెల్వరాజ్, సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్, నిర్మాతలు: అన్మోల్ శర్మ, బన్నీ వాసు, అశోక్ బండ్రెడ్డి, దర్శకత్వం: మోహన్.బి.




