టార్టాయిస్ రంగు రంగుపిల్లరో పాట, NewzFast Telugu: రాజ్‌తరుణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘టార్టాయిస్’ నుంచి ‘రంగు రంగుపిల్లరో’ అనే పాటను బుధవారం విడుదల చేశారు.
రిత్విక్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అమృత చౌదరి, అవసరాల శ్రీనివాస్, ధన్య బాలకృష్ణ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమాను త్వరలో విడుదల చేయడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.
అనూప్ రూబెన్స్ స్వరపరచిన ఈ పాటను పెంచల్‌దాస్ రచించారు. జానపద శైలిలో సాగిన ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
విభిన్న కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని, రాజ్‌తరుణ్ పాత్ర కొత్త పంథాలో ఉంటుందని మేకర్స్ తెలిపారు.
ఈ చిత్రానికి సంగీతం అనూప్ రూబెన్స్ అందిస్తుండగా, నిర్మాతలుగా విజయ్ చౌదరి, శశిధర్ నల్ల, రామిశెట్టి రాంబాబు వ్యవహరిస్తున్నారు. కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలు, దర్శకత్వం రిత్విక్ కుమార్ చేపట్టారు.




