అర్ష్‌దీప్ సింగ్ ఎంగేజ్‌మెంట్, NewzFast Telugu (మౌంట్ మాంగనూయ్, న్యూజిలాండ్): టీమిండియా స్టార్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్‌కు నవంబర్ 11, బుధవారం క్రికెట్ కెరీర్ పరంగా, వ్యక్తిగత జీవితంలో ప్రత్యేక రోజుగా నిలిచింది. ఐపీఎల్‌లో అతను ముంబై ఇండియన్స్ జట్టులో చేరిన విషయం ఒకవైపు ఉండగా, తన వ్యక్తిగత జీవితంలో మరో కీలక అడుగు వేశాడు.
ప్రస్తుతం న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న అర్ష్‌దీప్ అదే రోజు తన ప్రేయసి సమ్రీన్ కౌర్‌తో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడు. మౌంట్ మాంగనూయ్‌లోని అందమైన ప్రదేశంలో అతను మోకాళ్లపై నిలబడి ఆమెకు ప్రపోజ్ చేశాడు.
ఆ తర్వాత ఆమె చేతికి రింగు తొడిగాడు.
ఈ ఫొటోలను సమ్రీన్ కౌర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. “జీవితం మనకు ఎన్నో ఇచ్చినా, ఒకరికొకరం దొరకడే నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది.
మనం జీవితాంతం కలిసే ఉందాం. 11.11.2026. హాయ్ కాబోయే భర్త.” అని ఆమె పోస్టు చేసింది.
జమ్మూకశ్మీర్‌కు చెందిన సమ్రీన్ కౌర్ నటి, మోడల్. 2018లో ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో ఫైనలిస్ట్‌గా నిలిచింది. పలు సినిమాల్లో కూడా ఆమె నటించింది.




