అండర్-19 ఆసియా కప్, NewzFast Telugu (మస్కట్, ఒమన్): అండర్-19 ఆసియా కప్‌లో భారత యువ జట్టు గురువారం కఠిన పరీక్షను ఎదుర్కోనుంది. తొలి సెమీఫైనల్లో పటిష్ట ఆఫ్ఘనిస్తాన్‌తో భారత్ తలపడనుంది.
చివరి లీగ్ మ్యాచ్‌లో యుఎఇపై 70 పరుగుల తేడాతో నెగ్గిన భారత్ సెమీస్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. గ్రూప్ దశలో నేపాల్, యుఎఇపై విజయాలు సాధించిన భారత్, పాకిస్తాన్ చేతిలో ఓటమి పాలైంది.
దీంతో గ్రూప్-ఎలో రెండు విజయాలతో రెండో స్థానంలో నిలిచి సెమీఫైనల్‌కు అర్హత సాధించింది.
మరోవైపు గ్రూప్-ఎలో పాకిస్తాన్ అద్భుత ఫామ్‌లో ఉంది. తొలి మ్యాచ్‌లో యుఎఇపై 9 వికెట్ల తేడాతో, రెండో మ్యాచ్‌లో భారత్‌పై 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
చివరి లీగ్ మ్యాచ్‌లో నేపాల్‌పై 101 పరుగుల తేడాతో నెగ్గి 6 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. గురువారం జరిగే రెండో సెమీఫైనల్లో పాకిస్తాన్ గ్రూప్-బిలో రెండో స్థానంలో ఉన్న బంగ్లాదేశ్‌తో తలపడనుంది.
అండర్-19 ఆసియా కప్ గ్రూప్-బిలో ఆఫ్ఘనిస్తాన్ జట్టు అద్భుత ప్రదర్శన కనబరిచింది. మూడు లీగ్ మ్యాచ్‌ల్లోనూ ఘన విజయాలు సాధించింది.
తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై 113 పరుగుల తేడాతో, రెండో మ్యాచ్‌లో మలేషియాపై 10 వికెట్ల తేడాతో నెగ్గింది. చివరి మ్యాచ్‌లో శ్రీలంకపై 106 పరుగుల తేడాతో విజయం సాధించి దుర్భేద్యమైన ఫామ్‌లో ఉంది.
ఈ నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్‌ను ఓడించాలంటే భారత యువ జట్టు తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. సెమీఫైనల్ మ్యాచ్‌ల్లో విజయం సాధించిన జట్లు 14న జరిగే ఫైనల్లో టైటిల్ కోసం తలపడతాయి.
భారత జట్టు: చందాని (కెప్టెన్), ఆర్యవీర్ సెహ్వాగ్, వినీత్, అర్జున్ రాజ్‌పుత్, యశ్‌బర్దన్ చౌహాన్, అన్వయ్ ద్రావిడ్ (వికెట్ కీపర్), మనాల్ చౌహాన్, మోహిత్ ఉర్వా, అర్యాన్ సవాన్సీ, కావ్య పటేల్, ఇషాన్ సూద్.
ఆఫ్ఘనిస్తాన్ జట్టు: సొహైల్ ఖాన్ (కెప్టెన్), అబ్దుల్లా, ఫరీదుల్లా, సుభాన్ జఖైల్, సలార్జయ్ (వికెట్ కీపర్), షా ఫైసల్, తాహిర్, అమీర్, ముబరేజ్, నూర్ అలీ, బిలాల్.




