అర్ష్‌దీప్ సింగ్ ఎంగేజ్మెంట్, NewzFast Telugu (మౌంట్ మాంగనూయ్, న్యూజిలాండ్): టీమిండియా స్టార్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్‌కు నవంబర్ 11 (బుధవారం) క్రికెట్ కెరీర్ పరంగానే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ ప్రత్యేక రోజుగా నిలిచింది. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ జట్టులో చేరిన అతను, ఇప్పుడు తన జీవితంలో మరో కీలక అడుగు వేశాడు.
ప్రస్తుతం న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న అర్ష్‌దీప్ సింగ్, బుధవారం తన ప్రేయసి సమ్రీన్ కౌర్‌తో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. మౌంట్ మాంగనూయ్‌లోని అందమైన ప్రదేశంలో అతను మోకాళ్లపై నిలబడి సమ్రీన్ కౌర్‌కు ప్రపోజ్ చేశాడు.
అనంతరం ఆమె చేతికి ఉంగరం తొడిగాడు.
ఆ ఫొటోలను సమ్రీన్ కౌర్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. “జీవితం మనకు ఎన్నో ఇచ్చినా, ఒకరికొకరం దొరకడమే నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది.
మనం జీవితాంతం కలిసే ఉందాం. 11.11.2026. హాయ్ కాబోయే భర్త” అని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు.
జమ్మూకశ్మీర్‌కు చెందిన సమ్రీన్ కౌర్ నటి, మోడల్. 2018లో ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో ఫైనలిస్ట్‌గా నిలిచారు. పలు సినిమాల్లోనూ ఆమె నటించారు.




