శ్రీశైలంలో కార్తీక మాసోత్సవాలు వైభవంగా, భక్తుల రద్దీ పెరుగుదల

శ్రీశైలం కార్తీక మాసోత్సవాలు: శివయ్యకు ప్రీతికరమైన కార్తీక మాసంలో శ్రీశైల క్షేత్రమంతా శివనామస్మరణతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. క్షేత్రంలో కార్తీక మాసోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. రెండవ రోజు బుధవారం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్లను దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. తెల్లవారుజామునుంచే భక్తులు కృష్ణానదిలో పుణ్యస్నానాలు చేసి, నదీమతల్లికి పసుపు కుంకుమ, చీర, గాజులను సారెగా సమర్పించారు. అనంతరం భక్తులు కార్తీక దీపాలు వెలిగించారు. ఇందుకోసం ఆలయ ఉత్తర మాడవీధి, ప్రధానాలయం గంగాధర మండపం వద్ద ప్రత్యేక.

శ్రీశైలం కార్తీక మాసోత్సవాలు, NewzFast Telugu (శ్రీశైలం, ఆంధ్రప్రదేశ్): శివయ్యకు ప్రీతికరమైన కార్తీక మాసంలో శ్రీశైల క్షేత్రమంతా శివనామస్మరణతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. క్షేత్రంలో కార్తీక మాసోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి.

రెండవ రోజు బుధవారం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్లను దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. తెల్లవారుజామునుంచే భక్తులు కృష్ణానదిలో పుణ్యస్నానాలు చేసి, నదీమతల్లికి పసుపు కుంకుమ, చీర, గాజులను సారెగా సమర్పించారు.

అనంతరం భక్తులు కార్తీక దీపాలు వెలిగించారు. ఇందుకోసం ఆలయ ఉత్తర మాడవీధి, ప్రధానాలయం గంగాధర మండపం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

అదేవిధంగా లక్ష దీప నోములు చేసుకుంటూ మహిళలు మొక్కులు తీర్చుకున్నారు.

కంపార్టుమెంట్లు, క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు అల్పాహారం, మంచినీరు అందించారు. ఉదయం నుంచి రాత్రి వరకు అన్నదాన భవనంలో ప్రసాద వితరణ కొనసాగుతోంది.

సాయంత్రం స్వామిఅమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రధాన ధ్వజస్తంభంపై ఆకాశ దీపాన్ని ఆవిష్కరించారు.

భక్తులకు అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లను ఈఓ శ్రీనివాసరావు, ట్రస్టుబోర్డు చైర్మన్ పోతుగుంట రమేశ్ నాయుడు పర్యవేక్షించారు.

ముఖేష్ గుసాయిన్

ముఖేష్ గుసాయనా 6 సంవత్సరాల జర్నలిజం అనుభవం కలిగిన డిజిటల్ న్యూస్ ఎడిటర్. JCD విద్యాపీఠ్, సిర్సా నుంచి BMC పూర్తి చేశారు. NewzFastTelugu.com ద్వారా విశ్వసనీయమైన వార్తలు మరియు ఉపయోగకరమైన సమాచారాన్ని పాఠకులకు అందించడంపై దృష్టి సారిస్తున్నారు.

Website

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

క్రీడలు

వార్తా విభాగాలు