కోడిగుడ్డు ధరలు పెరిగినా పౌల్ట్రీ రైతుకు దక్కని మద్దతు ధర

కోడిగుడ్డు ధర: మార్కెట్‌లో కోడిగుడ్డు ధరలు ఆకాశాన్ని అంటుతున్నా, రైతుకు మాత్రం కనీస మద్దతు ధర లభించడం లేదు. ఏడాది పొడవునా దాణా ఖర్చులను భరిస్తూ వస్తున్నా, రైతుకు ఒక్కో గుడ్డుకు కేవలం రూ. 6.00 మాత్రమే దక్కుతోంది. మార్కెట్ పరిస్థితులు ఆశాజనకంగా లేకపోవడంతో రైతులు కొత్త బ్యాచ్‌ల (కోళ్ల పెంపకం) వైపు మొగ్గు చూపడం లేదు. గడచిన నాలుగేళ్లుగా దాణా ఖర్చులు విపరీతంగా పెరిగిపోవడంతో ఈ రంగంపై రైతుల్లో తీవ్ర నిరాసక్తత నెలకొంది. ప్రస్తుతం రిటైల్ మార్కెట్‌లో ఒక్కో గుడ్డు రూ. 7.50.

కోడిగుడ్డు ధర, NewzFast Telugu (రాజమహేంద్రవరం): మార్కెట్‌లో కోడిగుడ్డు ధరలు ఆకాశాన్ని అంటుతున్నా, రైతుకు మాత్రం కనీస మద్దతు ధర లభించడం లేదు. ఏడాది పొడవునా దాణా ఖర్చులను భరిస్తూ వస్తున్నా, రైతుకు ఒక్కో గుడ్డుకు కేవలం రూ. 6.00 మాత్రమే దక్కుతోంది.

మార్కెట్ పరిస్థితులు ఆశాజనకంగా లేకపోవడంతో రైతులు కొత్త బ్యాచ్‌ల (కోళ్ల పెంపకం) వైపు మొగ్గు చూపడం లేదు. గడచిన నాలుగేళ్లుగా దాణా ఖర్చులు విపరీతంగా పెరిగిపోవడంతో ఈ రంగంపై రైతుల్లో తీవ్ర నిరాసక్తత నెలకొంది.

ప్రస్తుతం రిటైల్ మార్కెట్‌లో ఒక్కో గుడ్డు రూ. 7.50 చొప్పున విక్రయిస్తున్నప్పటికీ, రైతులకు మాత్రం రూ. 6.00 మాత్రమే చెల్లిస్తున్నారు.

గత నెల ప్రారంభంలో రైతులకు రూ. 5.80 చొప్పున ధర లభించగా, రిటైల్ మార్కెట్‌లో రూ. 7.00 చొప్పున విక్రయాలు సాగాయి. తూర్పుగోదావరి జిల్లాలో వ్యవసాయం తర్వాత అతిపెద్ద పరిశ్రమ పౌల్ట్రీ రంగం.

సుమారు 300 పౌల్ట్రీ ఫారాలు ఉన్నాయి. 1.30 కోట్ల కోళ్లు ఉండగా, సుమారు 1.10 కోట్ల గుడ్లు ఉత్పత్తి జరుగుతోంది.

ప్రస్తుతం కొన్ని ఫారాలు మూత పడటంతో ఉత్పత్తి సామర్థ్యం 70 లక్షలకు పరిమితమైంది. దీనిలో స్థానిక మార్కెట్లలో 30 శాతం వినియోగిస్తుండగా 70 శాతం గుడ్డు ఈశాన్య రాష్ట్రాలైన ఒడిశా, బీహార్, బెంగాల్ రాష్ట్రాలకు రోజుకు వంద నుంచి 150 లారీలు ఎగుమతులు జరుగుతున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు.

గతేడాది ఇదే సీజన్‌లో కోడిగుడ్డు ధర రైతు వద్ద రూ. 5.80 కాగా ప్రస్తుతం రూ. 6.00కు చేరింది.

మేత, దాణా ఖర్చులు ఇటీవల కాలంలో గణనీయంగా పెరిగాయి. మొక్కజొన్న దాణా టన్నుకు ఏడాదిలో రూ. 19 వేల నుంచి రూ. 32 వేలు, సోయా రూ. 40 వేల నుంచి రూ. 65 వేలకు పెరిగింది.

ఈ ధరల పెరుగుదల నేపథ్యంలో కనీసం రూ. 6.50 రైతులకు లభిస్తే నష్టాల నుంచి కాస్త ఉపశమనం కలుగుతుందని రైతులు చెబుతున్నారు. గుడ్డు ఉత్పత్తికి రూ. 6.00 ఖర్చవుతున్నట్లు వివరిస్తారు.

గుడ్డు పెట్టే కోళ్లను ఆరు నెలల పెంపకం అనంతరం మరో ఆరు నెలలు గుడ్డు ఉత్పత్తి జరుగుతుంది. ఏడాది అనంతరం కొత్త బ్యాచ్‌లు వేయడం పరిపాటి.

ఈ ఏడాది జనవరిలో కొత్త బ్యాచ్‌లు వేయకపోవడం, గత ఏడాది వేసిన బ్యాచ్‌లను మే నెలలో కోతకు తరలించడంతో గుడ్డు పెట్టే కోళ్ల కొరత నెలకొంది. కొత్త బ్యాచ్‌లు వేయకపోవడానికి నష్టాలే కారణమని రైతులు వాపోతున్నారు.

గడిచిన నాలుగేళ్లలో దాణా, ఇతర ఖర్చులు రెండింతలు పెరగడంతో రైతులు నష్టాలు చవిచూస్తున్నారు. మేత ధరలు, విద్యుత్ బిల్లుల పెట్టుబడి పెరగటంతో ఉత్పత్తి ఖర్చు రూ. 6.50కు చేరింది.

అన్ని కాలాల్లోనూ గుడ్డు ధర కనీసం రూ. 7.00 ఉంటేనే రైతుకు నష్టాల నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది.

ముఖేష్ గుసాయిన్

ముఖేష్ గుసాయనా 6 సంవత్సరాల జర్నలిజం అనుభవం కలిగిన డిజిటల్ న్యూస్ ఎడిటర్. JCD విద్యాపీఠ్, సిర్సా నుంచి BMC పూర్తి చేశారు. NewzFastTelugu.com ద్వారా విశ్వసనీయమైన వార్తలు మరియు ఉపయోగకరమైన సమాచారాన్ని పాఠకులకు అందించడంపై దృష్టి సారిస్తున్నారు.

Website

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

క్రీడలు

వార్తా విభాగాలు