రామాయణ సినిమా, NewzFast Telugu (ముంబై): సూపర్ స్టార్ మహేష్ బాబు తనయుడు గౌతమ్ ఘట్టమనేని త్వరలోనే హీరోగా ఎంట్రీ ఇచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ స్టార్ కిడ్ సినిమాల్లోకి రాకముందే వార్తల్లో నిలుస్తున్నారు.
ముఖ్యంగా ఇటీవల సినిమాలకు రేటింగ్‌లు, రివ్యూలు ఇస్తూ తరచూ చర్చనీయాంశంగా మారుతున్నారు.
ఇటీవల నాని నటించిన ‘ది ప్యారడైజ్’ చిత్రానికి షాకింగ్ రివ్యూ, రేటింగ్ ఇచ్చి వార్తల్లో నిలిచిన గౌతమ్, తాజాగా రామాయణ సినిమాపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఇప్పటివరకు చాలా సినిమాలకు తక్కువ రేటింగ్ ఇచ్చిన ఆయన, ఈ చిత్రానికి 4.5 రేటింగ్ ఇవ్వడం విశేషం.
“రామాయణ సినిమా చూశాక నా మనసు పూర్తిగా కరిగిపోయింది, మాటలు రావడం లేదు. ఇందులో సీజీఐ, స్క్రిప్ట్, దర్శకత్వం, నటన అన్నీ అత్యద్భుతంగా ఉన్నాయి” అని గౌతమ్ పేర్కొన్నారు.
రాముడి పాత్రలో రణ్‌బీర్ కపూర్ ఎప్పటిలాగే అద్భుతమైన నటన కనబరిచారని ఆయన ప్రశంసించారు.
రావణాసురుడి పాత్రలో యష్ నటన తనను విపరీతంగా ఆకట్టుకుందని, అది అసాధారణమని గౌతమ్ తెలిపారు. ప్రతి ఒక్కరూ కచ్చితంగా చూడాల్సిన సినిమా ఇదని, భారతీయ సినిమా సత్తాను చాటిచెప్పే నిదర్శనమని ఆయన కొనియాడారు.
ఈ రివ్యూ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
నితేష్ తివారీ తెరకెక్కించిన ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతాదేవిగా నటించారు. సన్నీ డియోల్, శోభన, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, వివేక్ ఒబెరాయ్, అనుపమ్ ఖేర్ తదితరులు వివిధ పాత్రల్లో కనిపించారు.
ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్, డీఎన్ఈజీ సంస్థలు భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించాయి. హన్స్ జిమ్మర్, ఏ ఆర్ రెహమాన్ సంయుక్తంగా సంగీతం అందించారు.




