నందిపేట్ విద్యార్థుల మిస్సింగ్, NewzFast Telugu (నందిపేట, నిజామాబాద్ జిల్లా): నందిపేట మండలం కుదన్పూర్ ప్రభుత్వ ఎస్సీ హాస్టల్లో చదువుతున్న ఇద్దరు 13 ఏళ్ల విద్యార్థులు అదృశ్యమైనట్లు ఎస్సై వినయ్ తెలిపారు.
మాక్లూర్ మండలం ధర్మారం గ్రామానికి చెందిన 8వ తరగతి విద్యార్థి కళ్లెం చరణ్, 9వ తరగతి విద్యార్థి గంధం సిద్ధు దీపావళి సెలవులకు ఇంటికి వెళ్లారు. మంగళవారం సాయంత్రం వారు తిరిగి హాస్టల్కు బయలుదేరారు.
కుటుంబ సభ్యులు వీరిని ఆంధ్రానగర్లో ఒక వ్యక్తి బైక్పై లిఫ్ట్ ఇచ్చి పంపినట్లు తెలిసింది. అయితే బుధవారం వరకు కూడా పిల్లలు హాస్టల్కు చేరుకోలేదు.
విద్యార్థులు హాస్టల్కు రాలేదని వార్డెన్ తల్లిదండ్రులకు ఫోన్ చేయడంతో అదృశ్యమైన విషయం వెలుగులోకి వచ్చింది. తల్లిదండ్రులు ఎక్కడ వెతికినా ఆచూకీ లభించకపోవడంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఈ విద్యార్థులు పరిసర ప్రాంతాల్లోని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు లేదా ఇతర ప్రదేశాల్లో కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్సై కోరారు.




