వ్యాధిగ్రస్త జీవాల మాంసం విక్రయం, NewzFast Telugu (నాగిరెడ్డిపేట్, గోపాల్‌పేట్): వ్యాధిగ్రస్త గొర్రెలు, మేకలను వధించి వాటి మాంసాన్ని విక్రయిస్తున్నారనే ఫిర్యాదుల నేపథ్యంలో బుధవారం గోపాల్‌పేట్ గ్రామంలోని మటన్ దుకాణాలను పశువైద్య, పంచాయతీ అధికారులు తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా దుకాణదారులకు గొర్రెలు, మేకలను వధించే ముందు వాటి ఆరోగ్య పరిస్థితిని తప్పనిసరిగా పరిశీలించాలని అధికారులు సూచించారు. వ్యాధిగ్రస్త జీవాలను వధించి మాంసం విక్రయించకూడదని, ఆరోగ్యవంతమైన జీవాలను మాత్రమే వధించి మాంసాన్ని విక్రయించాలని ఆదేశించారు.
ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే విధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పశువైద్యాధికారి డాక్టర్ రవికుమార్, గోపాల్‌పేట్ పంచాయతీ కార్యదర్శి సలీం, పశువైద్య సిబ్బంది ఘౌస్, గంగారాం, గ్రామస్థులు పాల్గొన్నారు.




